గురువారం 25 ఫిబ్రవరి 2021
Yadadri - Feb 20, 2020 , 00:37:27

రైతు సంక్షేమానికి కృషి చేస్తా

రైతు సంక్షేమానికి కృషి చేస్తా

ఆలేరుటౌన్‌: రైతు సంక్షేమానికి నిరంతరం పాటుపడుతానని పీఏసీఎస్‌ మొ గులగాని మల్లేశ్‌ అన్నారు. ఆలేరు పట్టణంలోని వ్యవసాయ పరపతి సహకార సంఘం చైర్మన్‌గా బుధవారం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులకు నిరంతరం అందుబాటులో ఉంటానన్నారు. ప్రభుత్వపరంగా అందే సబ్బిడీ రుణాలు, ఎరువులు, మద్దతు ధర అందేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి సహకారంతో పీఏసీఎస్‌ను మరింతగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. అంతకుముందు సంఘం వైస్‌ చైర్మన్‌గా ఎన్నికైన చింతకింది చంద్రకళ, డైరెక్టరర్లు కట్టెగొమ్ముల సాగర్‌రెడ్డి, కేతావత్‌ సుందర్‌నాయక్‌, వట్టిపల్లి స్వామి, దారెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, మారెపెల్లి భిక్షపతి, బీస కృష్ణంరాజు, బైరపాక లక్ష్మి, దడిగె అంజయ్య, కూళ్ల సిద్ధులు, ఆరె మల్లేశం, గవ్వల నర్సింహులును టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. కార్యక్రమం లో ఆలేరు మార్కెట్‌ చైర్మన్‌ పడాల శ్రీనివాస్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్‌ యాదవ్‌, ఆలేరు పు రపాలక సంఘం చైర్మన్‌ వస్పరి శంకరయ్య, సర్పంచ్‌ శ్రీశైలం, నాయకులు ఎండీ ఖాదర్‌, బాలస్వామి, పరమేశ్వర్‌,  అంజయ్య, నర్సింహులు, డా.మురళి,  రామన్‌, శంకరయ్య, పాశికంటి శ్రీనివాస్‌, పంతం కృష్ణ, బింగి రవి, పుట్ట మల్లేశ్‌, కూళ్ల సిద్ధులు, కూళ్ల వెంకటేశ్‌, ఎండీ ఫయాజ్‌ ఉన్నారు.

VIDEOS

logo