సోమవారం 08 మార్చి 2021
Yadadri - Feb 18, 2020 , 22:39:50

కేసీఆర్‌ పాలనలోనే దేవాలయాలకు ప్రాముఖ్యత

కేసీఆర్‌ పాలనలోనే దేవాలయాలకు ప్రాముఖ్యత

బీబీనగర్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ చొరవతో చారిత్రాత్మకమైన ప్రాచీన దేవాలయాలకు ప్రాముఖ్యత ఏర్పడిందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య అన్నారు. మండలంలోని పడమటిసోమారం గ్రామంలో కొనసాగుతున్న శ్రీ లింగబస్వేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డితో కలిసి ఆయన స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు వారికి మంత్రోచ్ఛారణలతో స్వాగతం పలికి ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం రాత్రి నిర్వహించిన అగ్నిగుండాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో వారు పాల్గొని మాట్లాడారు. గతంలో ఎంతో చరిత్ర కలిగిన ఆలయాలు వెలుగులోకి రాలేదని, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలోని పురాతన ఆలయాల ఆవశ్యకత బయటకు వస్తున్నదన్నారు. ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ప్రత్యేక నిధులను వెచ్చిస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నారన్నారు. 


అనంతరం బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కబడ్డీ క్రీడాపోటీల్లో గెలుపొందిన జట్లకు బహుమతులు అందజేశారు. మల్కాజిగి పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డి, డీసీపీ నారాయణరెడ్డి వేర్వేరుగా స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. కార్యక్రమాల్లో ఎంపీపీ యర్కల సుధాకర్‌గౌడ్‌, జడ్పీటీసీ గోళి ప్రణీతాపింగళ్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్‌ బొక్క జైపాల్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ మెట్టు మోహన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు, సర్పంచ్‌ తలబోయిన గణేశ్‌యాదవ్‌ నాయకులు మల్లగారి శ్రీనివాస్‌, అమృతం శివకుమార్‌, సోంరమేశ్‌, బొమ్మగాని బస్వయ్య, వాకిటి బస్వారెడ్డి, అల్వ వీరారెడ్డి, గడ్డం బాల్‌రెడ్డి, ఆలయ ఈఓ నరేందర్‌రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.

VIDEOS

logo