పండుగలా..

తెలంగాణ ఉద్యమనేత.... బంగారు తెలంగాణ ప్రదాత.. దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలను సోమవారం జిల్లాలో ఘనంగా జరుపుకొన్నారు.
- జిల్లా వ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు
- మొక్కలు నాటిన ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా
- మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, రాచకొండ సీపీ మహేశ్‌భగవత్, కలెక్టర్ అనితారామచంద్రన్
తెలంగాణ ఉద్యమనేత.... బంగారు తెలంగాణ ప్రదాత.. దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలను సోమవారం జిల్లాలో ఘనంగా జరుపుకొన్నారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నమస్తే తెలంగాణ జిల్లా బృందం ప్రత్యేక పూజలు నిర్వహించింది. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమం కోలాహలంగా సాగింది. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహుడి సన్నిధి నుంచి ఆమె మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. చౌటుప్పల్ శివారులో నూతనంగా నిర్మిస్తున్న ఏసీపీ కార్యాలయంలో రాచకొండ సీపీ మహేశ్‌భగవత్, తుర్కపల్లి మండలం మల్కాపురంలో కలెక్టర్ అనితారామచంద్రన్ మొక్కలు నాటారు. భువనగిరిలో ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి కేక్ కట్‌చేసి మొక్కలు నాటి అన్నదానం చేశారు. శాసనమండలి విప్ కర్నె ప్రభాకర్, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
-యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ: తెలంగాణ ఉద్యమనేత.... బంగారు తెలంగాణ ప్రదాత దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలను సోమవారం జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు.యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో టీయూడబ్లూజే హెచ్ 143 జిల్లా కమిటీ, నమస్తే తెలంగాణ జిల్లా బృందం సీఎం బర్త్‌డే సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమం కోలాహలంగా కొనసాగింది. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహుడి సన్నిధి నుంచి ఆమె మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మార్కెట్ కూడలి వద్ద ఆమె అడిషనల్ కలెక్టర్ కీమ్యానాయక్తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. శాసనమండలి విప్ కర్నె ప్రభాకర్ సీఎంను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చౌటుప్పల్ శివారులోని నూతనంగా నిర్మిస్తున్న ఏసీపీ కార్యాలయంలో రాచకొండ సీపీ మహేశ్‌భగవత్ , తుర్కపల్లి మండలం మల్కాపురంలో కలెక్టర్ అనితారామచంద్రన్ మొక్కలు నాటారు.
ఆలేరు నియోజకవర్గంలో ఘనంగా...
సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఆలేరు నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి సూచనలతో ఘనంగా జరుపుకున్నారు. మల్కాపురంలో కలెక్టర్ అనితారామచంద్రన్, జడ్పీ సీఈవో కృష్ణారెడ్డిలతో కలిసి ఆమె మొక్కలు నాటారు. యాదగిరిగుట్ట, ఆలేరు, ఆత్మకూర్ (ఎం), రాజాపేట తదితర మండలాల్లో కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. జడ్పీటీసీలు, ఎంపీపీలు, సింగిల్ విండో చైర్మన్లు పాల్గొన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని ఎస్వీఎన్ రెసిడెన్షియల్ హైస్కూల్లో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో హరితహారం నిర్వహించారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా వినూత్న కార్యక్రమాలు నిర్వహించినట్లు ఏఎస్ఐలు శ్రీరాములు, జాఫర్ వెల్లడించారు. అనంతరం పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా వ్యవస్థాపకుడు గొట్టిపర్తి భాస్కర్, డైరెక్టర్ మాధురి విద్యార్థులతో కలిసి కేక్‌ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మొక్కలు నాటారు.
భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో...
కేసీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి పూల మొక్కను బహూకరించారు. భువనగిరి నియోజకవర్గ వ్యాప్తంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. నియోజకవర్గంలోని భువనగిరి పట్టణ, మండలాలతో పాటు, భూదాన్‌పోచంపల్లి, వలిగొండ, బీబీనగర్ మండలాల్లో ముఖ్యమంత్రి జన్మదిన కేక్‌లను కట్ చేసి మొక్కలు నాటారు. భువనగిరి పట్టణంలో డంపింగ్‌యార్డు, గంజ్మార్కెట్యార్డులో ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి జన్మదిన కేక్‌ను కట్ చేసి, మొక్కలు నాటి అన్నదానం చేశారు. భువనగిరి మండలంలోని వడాయిగూడెంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవ కేక్‌ను కట్ చేసి మొక్కలు నాటారు. భూదాన్‌పోచంపల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. వలింగొండలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు డేగల పాండరి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేసి బస్టాండ్ ఆవరణలో మొక్కలు నాటారు. టేకులసోమారం గ్రామ సమీపంలోని సాధన మానసిక వికలాంగుల కేంద్రంలో ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మానసిక వికలాంగులకు దుప్పట్లు పంపిణీ చేసి అన్నదానం చేశారు. అనంతరం మొక్కలు నాటారు. బీబీనగర్‌లో మొక్కలు నాటి, జన్మదిన కేక్‌ను కట్ చేసిన అనంతరం దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
అట్టహాసంగా జన్మదిన వేడుకలు
చౌటుప్పల్ డివిజన్ వ్యాప్తంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను అట్టహాసంగా జరుపుకున్నారు. అన్ని మండలాల్లో టీఆర్ఎస్ నాయకులు సీఎం జన్మదినాన్ని వైభవంగా చేసుకున్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని జయభూమి, చౌటుప్పల్ మండల శివారులోని నూతనంగా నిర్మిస్తున్న ఏసీపీ కార్యాలయంలో సీపీ మహేశ్‌భగవత్ మొక్కలు నాటారు. అమానాన్న అనాథాశ్రమం, సింగిల్‌విండో కార్యాలయంలో చైర్మన్ చింతల దామోదర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలో ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు పాల్గొని మొక్కలు నాటారు. కేక్‌కట్‌చేసి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సంస్థాన్‌నారాయణపురం మండలం సర్వేల్లో సీఎం కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు. అపరభగీరథుడు సీఎం కేసీఆర్ అని వక్తలు కొనియాడారు. రామన్నపేట మండలంలో సీఎం కేసీఆర్ జన్మదినం అట్టహాసంగా కొనసాగింది. ఈ వేడుకలో పాల్గొన్న ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి బలరాం, సింగిల్‌విండో చైర్మన్ నంద్యాల భిక్షంరెడ్డి మొక్కలు నాటి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మోత్కూరు మార్కెట్ యార్డులో ఆయిల్‌ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి మొక్కలు నాటారు.అడ్డగూడూరు మండలంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.
తాజావార్తలు
- ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా అప్డేట్
- హంగ్ వస్తే బీజేపీతో దీదీ దోస్తీ: ఏచూరీ
- ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
- కేంద్ర మంత్రికి లేఖ రాసిన మంత్రి కేటీఆర్
- శ్రీలంక క్రికెట్ డైరెక్టర్‌గా టామ్ మూడీ
- టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి
- అంబేద్కర్ ఆదర్శనీయుడు : మంత్రి కొప్పుల ఈశ్వర్
- మయన్మార్‌లో నిరసనకారులపై కాల్పులు.. 18 మంది మృతి
- ఆర్మీ రిక్రూట్మెంట్ పరీక్ష రద్దు
- రైతు విజ్ఞాన కేంద్రాలుగా రైతు వేదికలు