సంతు సేవాలాల్‌ను ఆదర్శంగా తీసుకోవాలి

గిరిజనుల ఆరాధ్యదైవమైన సంతు సేవాలాల్‌ను ఆదర్శంగా తీసుకోవాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం తుర్కపల్లి మండలం మల్కాపూర్‌లో అధికారికంగా నిర్వహించిన ఆలేరు నియోజకవర్గస్థాయి సంతు సేవాలాల్ మహరాజ్ 281వ జయంతి
- ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి
గిరిజనుల ఆరాధ్యదైవమైన సంతు సేవాలాల్‌ను ఆదర్శంగా తీసుకోవాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం తుర్కపల్లి మండలం మల్కాపూర్‌లో అధికారికంగా నిర్వహించిన ఆలేరు నియోజకవర్గస్థాయి సంతు సేవాలాల్ మహరాజ్ 281వ జయంతిలో కలెక్టర్ అనితారామచంద్రన్, జడ్పీ సీఈవో కృష్ణారెడ్డితో కలిసి ఆమె ప్రత్యేక పూజలు చేశారు. -తుర్కపల్లి
తుర్కపల్లి : గిరిజనుల ఆరాధ్యదైవమైన సంతు సేవాలాల్ మహరాజ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని మల్కాపూర్‌లో అధికారికంగా నిర్వహించిన ఆలేరు నియోజకవర్గస్థాయి సంతు సేవాలాల్ మహరాజ్ 281వ జయంతిలో కలెక్టర్ అనితారామచంద్రన్, జడ్పీ సీఈవో కృష్ణారెడ్డితో కలిసి ఆమె ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గిరిజనజాతిని ఐక్యం చేసేందుకు సేవాలాల్ మహరాజ్ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. గత ప్రభుత్వాలు గిరిజనులను ఏనాడూ పట్టించుకోలేదని, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అన్ని కులాలు, మతాలకు ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గిరిజనులు ఆత్మగౌరవంగా ఉండేందుకు హైదరాబాద్‌లో బంజారా భవన్‌ను నిర్మిస్తుందన్నారు. 500 జనాభా కలిగిన ప్రతి తండాను గ్రామపంచాయతీగా మార్చి గిరిజనులు స్వయం పాలన చేసుకునే వెసులుబాటు కల్పించారన్నారు.
సేవాలాల్ జయంతి ఉత్సవాల నిర్వహణకు నియోజకవర్గానికి రూ.96లక్షలను మంజూరు చేసిందన్నారు. మండలంలో సేవాలాల్ ఆలయ నిర్మాణానికి ఎకరం స్థలాన్ని కేటాయించాలని కలెక్టర్‌కు సూచించారు. యాదగిరిగుట్టలో బంజారా భవన్ నిర్మాణానికి స్థలాన్ని కేటాయించేందుకుగాను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. తండాల్లో చైతన్యం రావాలంటే చదువు తప్పనిసరి అని కలెక్టర్ అనితారామచంద్రన్ అన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, జడ్పీవైస్‌చైర్మన్ బిక్కునాయక్, తుర్కపల్లి,బొమ్మలరామారం ఎంపీపీలు సుశీలారవీందర్, సుధీర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నరసింహారెడ్డి, వైస్ ఎంపీపీ మహదేవుని శ్రీనివాస్, రైతుసమన్వయ సమితి మండల కన్వీనర్ నర్సింహులు, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు ఆంజనేయులు, సర్పంచ్‌లు అమల, జ్యోతి, సురేశ్, శారద, లలిత, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు నవీన్‌కుమార్, ఎంపీటీసీ కరుణాకర్, కోఆప్షన్ పోరం జిల్లాఅధ్యక్షుడు రహమత్‌షరీఫ్, నాయకులు రాంరెడ్డి, శట్టయ్య, రమేష్‌యాదవ్, బద్దునాయక్, హరినాయక్, భాస్కర్‌నాయక్, లప్పానాయక్, శంకర్‌నాయక్, లక్ష్మణ్, దేవదాసు, రాములునాయక్ పాల్గొన్నారు.