కేక్ కట్ చేసి మొక్కలు నాట్టి

సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు భువనగిరి నియోజకవర్గ వ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు సోమవారం ఘనంగా నిర్వహించారు. మొక్కలు నాటి, కేక్‌లు కట్ చేయడంతోపాటు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.
- ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు
- -సేవా కార్యక్రమాలు చేపట్టిన నాయకులు, అభిమానులు
భువనగిరి, నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు భువనగిరి నియోజకవర్గ వ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు సోమవారం ఘనంగా నిర్వహించారు. మొక్కలు నాటి, కేక్‌లు కట్ చేయడంతోపాటు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. భువనగిరి రూరల్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఏసీపీ భుజంగరావు, రూరల్ సీఐ సురేందర్‌రెడ్డి, ఎస్సై రాఘవేందర్‌గౌడ్‌లు మొక్కలు నాటారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. మండలంలోని చందుపట్ల అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులు కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. అంగన్వాడీ సూపర్వైజర్ మహాలక్ష్మి, టీచర్ భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.
వలిగొండలో..
వలిగొండ: మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు టీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక బస్టాండ్ ఆవరణలో మొక్కలు నాటారు. అంతకుముందు కేక్ కట్ చేసి పంచి పెట్టారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు డేగల పాండరి, మాజీ జడ్పీటీసీ మొగుళ్ల శ్రీనివాస్, వలిగొండ పట్టణ అధ్యక్షుడు అయిటిపాముల రవీంద్ర, టీఆర్ఎస్ మండల కార్యదర్శులు మామిండ్ల రత్నయ్య, పైళ్ల మల్లారెడ్డి, చెరుకు శివయ్య, సింగిల్‌విండో డైరెక్టర్లు నానచర్ల శ్రీనివాస్, రేగు కొమురయ్య, అయిటిపాముల సత్యనారాయణ, ప్రభాకర్, ఎమ్మె లక్ష్మయ్య, పబ్బు స్వామి, పోలేపాక భిక్షపతి, యూత్ అధ్యక్షుడు ఎమ్మె లింగస్వామి, ఎస్సీసెల్ అధ్యక్షులు ఎడవెల్లి శాంతికుమార్, కొమిరెల్లి బాల్‌రెడ్డి, సలీం, రమేశ్, మల్లేశ్, కొడూరి వెంకటేశం, నర్సింహ, సురేశ్ పాల్గొన్నారు.
తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో..
వలిగొండ మండలం పరిధి టేకులసోమారంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సాధన మానసిక వికలాంగుల ఆశ్రమంలో మొక్కలు నాటారు. అదేవిధంగా దుప్పట్ల పంపిణీ, అన్నదానం చేపట్టారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ, మండల అధ్యక్షులు బచ్చు శ్రీనివాస్, కొడితాల నాగరాజు, అయ్యప్ప దేవాలయ కమిటీ అధ్యక్షులు చీకటిమల్ల వెంకటేశ్వర్లు, ములుగు నర్సయ్య, బెలిదె శ్రీనివాస్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
భువనగిరి పట్టణంలో..
భువనగిరి అర్బన్: భువనగిరి పట్టణంలోని 32వ వార్డు తారకరామనగర్‌లో సీఎం కేసీఆర్ కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో నాయకులు బోగ వెంకట్, హీరేకార్ రమేశ్, ఆనంద్, నందకుమార్, కొండల్, ఎండీ మునీర్, వెంకట్, అఫ్జల్, మహేశ్వరి, మహ్మద్, సర్వర్ పాల్గొన్నారు. హుసేనాబాద్కాలనీ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు ఎల్లంకి పురుషోత్తంరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం మొక్కల పెంపకంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల విద్యాకమిటీ చైర్మన్ రాంప్రసాద్‌రెడ్డి, ఉపాధ్యాయుడు అమరేందర్‌రెడ్డి, ఐలయ్య, మధుసూదన్‌రెడ్డి, దేవి, భరత్, బాల్‌నర్సింహ, మాజీ వార్డు సభ్యుడు ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానలో టీఆర్ఎస్ మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మైనార్టీ నాయకుడు ఎండీ నయీం, నాయకులు గొండబోయిన నర్సింహ, పాక మహేశ్, నక్కల అంజయ్య, రత్నపురం కృష్ణ, దేశగాని చందు, మల్లేశ్, కమల్ పాల్గొన్నారు.
ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో..
బీబీనగర్: మండలంలోని ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నేతల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో మొక్కలు నాటారు. బీబీనగర్‌లో ఎంపీపీ యర్కల సుధాకర్‌గౌడ్, జడ్పీటీసీ గోళి ప్రణీతాపింగళ్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ బొక్క జైపాల్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొలను లావణ్యదేవేందర్రెడ్డి, సర్పంచ్ మల్లగారి భాగ్యలక్షీశ్రీనివాస్ల ఆధ్వర్యంలో నేతలు మొక్కలు నాటారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. వైస్ ఎంపీపీ వాకిటి గణేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో కొండమడుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం మొక్కలను నాటారు. కార్యక్రమాల్లో ఎంఈవో నాగవర్ధన్‌రెడ్డి, సర్పంచులు మంచాల రవికుమార్, తలబోయిన గణేశ్‌యాదవ్, ఆముదాల సుమతి, గెగ్గలపల్లి మాధవీపురుషోత్తంరెడ్డి, మొరుగాడి బాలమల్లేశ్గౌడ్, మండల కోఆప్షన్ సభ్యుడు అక్బర్, మాజీ వైస్ ఎంపీపీ కొంతం లింగయ్యగౌడ్, టీఆర్ఎస్ మండల కార్యదర్శి చింతల సుదర్శన్‌రెడ్డి, మహిళా, యువజన విభాగం అధ్యక్షులు పిట్టల శ్యామలాశ్రీనివాస్, ఎలుగుల నరేందర్, ఉప సర్పంచ్ దస్తగిరి, నాయకులు గుంటిపల్లి లక్ష్మీనారాయణ, మంగ లింగేశ్, నెల్లుట్ల ప్రశాంతీశ్రీశైలం, బొర్ర లింగారెడ్డి, నారగోని మహేశ్‌గౌడ్, బుయ్య కిశోర్‌గౌడ్, జక్కి నగేశ్, పొట్ట అంజి, కడెం చంద్రశేఖర్, మస్తాన్, రమేశ్‌నాయక్, మురళి తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించిన ఉర్దూ టీచర్స్ అసోసియేషన్
- ఆటగాళ్లకు కరోనా.. పాకిస్థాన్ సూపర్ లీగ్ వాయిదా
- చికిత్స పొందుతున్న వ్యక్తిని పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి
- చెన్నై చేరుకున్న ధోనీ, రాయుడు..త్వరలో ట్రైనింగ్
- రాఫెల్ స్ఫూర్తితో.. ‘పంజాబ్ రాఫెల్’ వాహనం
- కురుమల మేలుకోరే పార్టీ టీఆర్ఎస్ : ఎమ్మెల్సీ కవిత
- టీ బ్రేక్..ఇంగ్లాండ్ 144/5
- ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్.. ఇండియాలో బెంగళూరే బెస్ట్
- ఉప్పెన చిత్ర యూనిట్‌కు బన్నీ ప్రశంసలు
- ఓటీటీలో పోర్న్ కూడా చూపిస్తున్నారు : సుప్రీంకోర్టు