మంగళవారం 02 మార్చి 2021
Yadadri - Feb 16, 2020 , 00:24:08

టీఆర్‌ఎస్‌ నాయకుల సంబురాలు

టీఆర్‌ఎస్‌ నాయకుల సంబురాలు

మోటకొండూర్‌ : వంగపల్లి, ఆలేరు, ఆత్మకూరు(ఎం)లో జరిగిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించడంతో శనివారం మండలకేంద్రంలో టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో పెద్ద ఎత్తున్న పటాకులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. అనంతరం గెలుపొందిన పార్టీ అభ్యర్థులు ప్రభుత్వవిప్‌, ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, సీఎం కేసీఆర్‌ రైతన్న సంక్షేమం కోసం నిరంతరం కృషి చేయడంతోనే టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థుల గెలుపు సాధ్యమైదన్నారు. ఆయా కార్యక్రమాల్లో నూతనంగా ఎన్నికైన డైరెక్టర్లు ఎగ్గిడి బాలయ్య, బీస కృష్ణంరాజు, పన్నాల అనితాకృష్ణరెడ్డి, బొబ్బల యాదిరెడ్డి, అంజయ్య, ఎంపీటీసీ పన్నాల అంజిరెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కో-ఆర్డినేటర్‌ భూమండ్ల ఐలయ్య, టీఆర్‌ఎస్‌ నాయకులు బోట్ల యాదయ్య, భూమండ్ల శ్రీనివాస్‌, పన్నాల నవీన్‌రెడ్డి, బోట్ల శ్రీనివాస్‌, వంగపల్లి అశోక్‌, బొలగాని మోహన్‌, అనంతుల జంగారెడ్డి, దడిగే మధు, జివిలికపల్లి వెంకటేశ్‌, గంధమల్ల మధు, నకిర్త ఉప్పలయ్య, ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


VIDEOS

logo