Yadadri
- Feb 16, 2020 , 00:23:03
VIDEOS
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి

తుర్కపల్లి : ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని ఎస్సై యాదగిరి యాదగిరిగుట్ట ట్రాఫిక్ ఎస్సై కృష్ణంరాజు అన్నారు. ట్రాఫిక్ నిబంధనలపై శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో వారు మాట్లాడుతూ.. డ్రైవింగ్ లైసెన్స్ లేని ప్రయాణం నేరమన్నారు. 18 సంవత్సరాల్లోపు పిల్లలకు వాహనాలు నడిపేందుకు తమ తల్లిదండ్రులు ప్రోత్సహించవద్దన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి విలువైన ప్రాణాలను కాపాడుకోవాలన్నారు. నిబంధనలు పాటించని వారిపై చట్టరిత్యా చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పడాల శ్రీనివాస్, జడ్పీ వైస్‌చైర్మన్ బీకునాయక్, ఎంపీటీసీ కరుణాకర్, నాయకులు సుంకరి శట్టయ్య, బోరెడ్డిరాంరెడ్డి, పడాల చంద్రం తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
MOST READ
TRENDING