అమ్మ వారికి ఊంజల్ సేవ

- శ్రీలక్ష్మీనరసింహునికి సువర్ణ పుష్పార్చన
- శ్రీవారి ఖజానాకు రూ.6,71,247 ఆదాయం
యాదగిరిగుట్ట, నమస్తే తెలంగాణ: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహుడి బాలాలయంలో శుక్రవారం సాయంత్రం ఊంజల్ సేవను కోలాహలంగా నిర్వహించారు. పరమ పవిత్రంగా మహిళా భక్తులు పాల్గొనే ఈ సేవలో వేలాది మంది పాల్గొని తరించారు. సకల సంపదల సృష్టికర్త.. తనను కొలిచిన వారికి నేనున్నానంటూ అభయ హస్తమిచ్చి కపాడే శ్రీలక్ష్మీ అమ్మవారికి విశేష పుష్పాలతో అలంకారం జరిపారు. బాలాలయం ముఖమండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు విడుతలుగా రూ.516 టికెట్ తీసుకున్న భక్తులకు సువర్ణపుష్పార్చన జరిపించారు. బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు. దీన్నే సువర్ణపుష్పార్చనగా భక్తులు అత్యంత ప్రీతికరంగా నిర్వహిస్తారు. మొదటగా శ్రీమన్యుసూక్త పారాయణం జరిపారు. ప్రత్యేకంగా బంగారంతో తయారు చేసిన 108 పుష్పాలను శ్రీవారి సన్నిధిలో ఉంచి వాటితో అర్చన జరిపారు. ఉప ప్రధానార్చకులు బట్టర్ సురేంద్రాచార్యులు ఆధ్వర్యంలోని అర్చక బృందం వైభవంగా ఈ పూజలు నిర్వహించారు. మత్తయిదువులు మంగళహారతులతో అమ్మ వారిని స్తుతిస్తూ.. పాటలు పాడుతూ.. సేవ ముందు నడిచారు. తిరువీధి సేవ అనంతరం అమ్మ వారిని బాలాలయం ముఖమంటపంలోని ఊయలతో శయనింపు చేయించారు. గంటపాటు వివిధ రకాల పాటలతో అమ్మ వారిని కొనియాడుతూ.. లాలిపాటలు కోలాహలంగా కొనసాగాయి. అష్టోత్తర పూజల్లో భక్తులు పాల్గొన్నారు.
అర్జిత పూజల కోలాహలం..
యాదాద్రిలో అర్జిత పూజల కోలాహలం తెల్లవారు జాము 3 గంటల నుంచి మొదలైంది. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవమూర్తులకు అభిషేకం జరిపారు. ఉదయం 3 గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు శ్రీలక్ష్మీ నరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించారు. ఉదయం 8 గంటలకు నిర్వహించిన శ్రీ సుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. ప్రతి రోజు నిర్వహించే నిత్యకల్యాణోత్సంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
శ్రీవారి ఖాజానాకు రూ.6,71,247 ఆదాయం..
శ్రీవారి ఖజానాకు రూ.6,71,247 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రధాన బుకింగ్‌తో రూ.87,044, రూ.100ల దర్శనంతో రూ.36,100, కల్యాణకట్ట ద్వారా రూ.14వేలు వ్రత పూజల ద్వారా రూ.29వేలు, ప్రసాద విక్రయాలతో రూ.2,59,840, శాశ్వత పూజల ద్వారా రూ.16,116, టోల్గేట్ ద్వారా రూ.2,100, అన్నప్రసాదంతో రూ.9,172, వాహనపూజల ద్వారా రూ.11,600, ఇతర విభాగాలతో రూ.1,69,475తో కలిపి శ్రీవారి ఖజానాకు రూ.6,71,247 ఆదాయం సమకూరినట్లు తెలిపారు.
18న హుండీ లెక్కింపు..
ఈ నెల 18న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి హుండీ లెక్కింపు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. యాదాద్రి కొండపై ఉదయం 8 గంటలకు హుండీ లెక్కింపు ప్రారంభం కానున్నదన్నారు.
తాజావార్తలు
- అమితాబ్ ఆరోగ్యంపై తాజా అప్డేట్..!
- స్వదస్తూరితో బిగ్ బాస్ బ్యూటీకు పవన్ సందేశం..!
- ఉపాధి హామీ పనులకు జియో ట్యాగింగ్
- 21 రోజులపాటు మేడారం ఆలయం మూసివేత
- మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
- రేయ్ రేయ్ రేయ్.. ‘అల్లరి నరేష్’ పేరు మార్చేయ్ ..
- పూరీ వారసుడు ఈ సారైన హిట్ కొడతాడా..!
- కరోనా టీకా తీసుకున్న ప్రధాని మోదీ
- తెలుగు ఇండస్ట్రీలో విషాదం.. యువ నిర్మాత కన్నుమూత
- మన వ్యాక్సిన్ సురక్షితమైంది: హీరో సందీప్‌కిషన్