ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Yadadri - Feb 14, 2020 , 23:29:14

‘పుల్వామా’ అమర జవాన్లకు ఘన నివాళి

‘పుల్వామా’ అమర జవాన్లకు ఘన నివాళి

ఆలేరుటౌన్‌: పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో అసువులు బాసిన అమర జవాన్లకు ఆలేరు పట్టణంలో పలువురు నివాళులర్పించారు. అమరులైన సైనికుల ఆత్మశాంతి చేకూర్చలని కోరుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డా.సీహెచ్‌ సత్యనారాయణ, లెక్చరర్లు, విద్యార్థులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. పట్టణంలోని జడ్పీహెచ్‌ బాలుర పాఠశాలలో ఎన్‌సీసీ విద్యార్థులు అమర జవానుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇందులో ఎన్‌సీసీ డైరెక్టర్‌ దూడల వెంకటేశ్వర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రేమసేవాసదనం ఆధ్వర్యంలో ఏకశిల, రామకృష్ణ గురుకుల విద్యాలయంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు అమర జవాన్లకు నివాళులర్పించగా, యువజన నాయకుడు అయిలి శివకుమార్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఆర్‌ కళాశాల నుంచి విద్యార్థులు, యువజన సంఘం నాయకులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రైల్వేగేటు సమీపంలోనున్న వివేకానంద విగ్రహాం వద్ద జవాన్ల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో స్థానిక ఎస్సై రమేశ్‌, 4వ వార్డు కౌన్సిలర్‌ శమంతకరెడ్డి పాల్గొన్నారు. 

బొమ్మలరామారంలో..

బొమ్మలరామారం : పుల్వామా ఘటనలో అమరులైన 40 మంది వీర జవాన్లను స్మరిస్తూ శుక్రవారం మండల కేంద్రంతోపాటు సోలిపేట, నాగినేనిపల్లి, ఫక్కీర్‌గూడెం తదితర గ్రామాల్లో ఆయా పాఠశాలల విద్యార్థులు ర్యాలీలు నిర్వహించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. దేశం కోసం అమరులైన జవాన్ల ప్రాణత్యాగాన్ని విలువకట్టలేమన్నారు. దేశభక్తిని కలిగి జాతీయవాదాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు.

వీర జవాన్లకు కొవ్వొత్తులతో ఘన నివాళి

ఆలేరురూరల్‌ : పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్లకు శుక్రవారం మండలంలోని కొలనుపాకలో టీఆర్‌ఎస్‌ యువజన విభాగం నాయకులు కొవ్వొత్తులతో ఘన నివాళులర్పించారు. అనంతరం కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ యువజన విభాగం జిల్లా నాయకుడు అమ్మగారి క్రాంతి, నాయకులు నర్ర రమేశ్‌, జంగ రవి, తేరాల శంకర్‌, గణేశ్‌, కరుణాకర్‌, లక్ష్మణ్‌, జహంగీర్‌ జెలెందర్‌ తదితరులు ఉన్నారు.

VIDEOS

logo