ముగిసిన ప్రచారం..

- చివరి రోజు జోరుగా ప్రచారం చేసిన టీఆర్ఎస్ మద్దతుదారులు
- ఇప్పటికే 15 పీఏసీఎస్‌లలో గులాబీ పాగా
- డీసీసీబీ, డీసీఎంఎస్ పదవుల కైవసానికి ఎమ్మెల్యేల కసరత్తు
- రైతు సంక్షేమ పథకాలే అస్ర్తాలు..
- ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో అభ్యర్థులు
సహకార ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక పోలింగ్‌కు ఒక్కరోజు మాత్రమే గడువు ఉండటంతో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల విజయోత్సాహంతో ఉన్న టీఆర్ఎస్ సహకార ఎన్నికల్లోనూ సత్తా చాటేలా ముందుకు సాగుతున్నది. రైతు సంక్షేమ పథకాలే ప్రచారాస్ర్తాలుగా మలుచుకొని పార్టీ మద్దతుదారులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఎమ్మెల్యేలు సైతం ప్రచారంలో పాల్గొని పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. డీసీసీబీ, డీసీఎంఎస్ పదవులను కైవసం చేసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని 15 పీఏసీఎస్‌ల్లో పాగా వేయగా, 15వ తేదీన 194 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. అదేరోజు ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు.
యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ : వరుస ఎన్నికల్లో గెలుపొంది విజయోత్సాహంతో ఉన్న టీఆర్ఎస్ సహకార ఎన్నికల ప్రచారంలోనూ దూసుకెళ్తున్నది. చివరి రోజు గురువారం టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు రైతుల వద్దకు వెళ్లి ముమ్మర ప్రచారం నిర్వహించారు. అభ్యర్థుల తరపున ఎమ్మెల్యేలు ఓటు హక్కు ఉన్న రైతులను కలుసుకొని గెలిపించాలని కోరారు. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ జిల్లాలోని అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను కైవసం చేసుకొని జిల్లాస్థాయి పదవులైన డీసీసీబీతో పాటు డీసీఎంఎస్ పదవులను కూడా తమ ఖాతాలో వేసుకునేందుకు టీఆర్ఎస్ పార్టీ పక్కా వ్యూహాన్ని అనుసరించింది. అంతేకాక ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రతి సొసైటీలో టీఆర్ఎస్ మద్దతుదారులు గెలిచే విధంగా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు మంత్రి జగదీశ్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు.
జోరుగా సాగిన టీఆర్ఎస్ మద్దతుదారుల ప్రచారం..
సహకార ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుదారులు ప్రచారపర్వాన్ని రక్తి కట్టించారు. స్థానికంగా ఉన్న రైతులను కలువడంతో పాటు సుదూర ప్రాంతాల్లో ఉన్న వారి వివరాలను కనుక్కొని మద్దతును కూడగట్టుకుంటున్నారు. మరోవైపు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, పైళ్ల శేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా విస్తృతంగా ప్రచారం చేశారు.
తాజావార్తలు
- నా పేరే..సారంగ దరియా!
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. ఫోటోలు ఇలా డిలిట్
- పెట్టుబడిదారులకు లిటిల్ సీజర్స్ న్యూ బిజినెస్ ప్రపోజల్
- భారత్‌పై సైబర్ దాడుల వార్తలు నిరాధారం:చైనా
- అక్షరమై మెరిసెన్..సయ్యద్ అఫ్రీన్!
- ఆరోగ్యానికి..ప్రకృతి సూత్రం
- సేవలను విస్తరించిన సెటిల్
- రోబో-జోజో.. ఫ్రెండ్స్!
- పెట్రోల్ ధరల సెగ.. విద్యుత్ స్కూటర్లకు ఫుల్ డిమాండ్
- కార్న్ దోశ