సహకార పోరుకు సర్వం సిద్ధం

- ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్ అనితారామచంద్రన్
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ: సహకార ఎన్నికలకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 15న జరుగనున్న సహకార ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన ఏర్పాట్లపై కలెక్టర్ అనితారామచంద్రన్ జిల్లా అధికారులతో గురువారం సాయంత్రం సమీక్షించారు. అడిషన ల్ కలెక్టర్ జి.రమేష్, డీఆర్డీవో పీడీ మందడి ఉపేందర్‌రెడ్డి, ఆర్డీవోలు భూపాల్‌రెడ్డి, సూరజ్‌కుమార్, డీసీవో టి.వెంకట్‌రెడ్డిలతో పాటు ఏడుగురు జోనల్ అధికారులతో ఎన్నికల నిర్వహణకు తీసుకుంటున్న ఏర్పాట్లపై చర్చిం చారు. భువనగిరి డివిజన్ జరిధిలోని 12 మం డలాలకు సంబంధించిన 13 సొసైటీలు, 115 వార్డులు.. చౌటుప్పల్ డివిజన్లోని 5 మండలా లకు సంబంధించి 8 సొసైటీలు, 79 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకు సం బంధించిన పోలింగ్ మెటీరియల్‌ను 14వ తేదీ ఉదయం అందివ్వనున్నారు. భువనగిరి డివి జన్‌కు సంబంధించి ప్రభుత్వ జూనియర్ కళా శాల, చౌటుప్పల్ డివిజన్‌కు సంబంధించి చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో ప్రిసైడింగ్ , ఎన్నికల అధికారులు ఆయా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు 14న ఉదయం 8గంటలకు చేరుకొని పోలింగ్ మెటీరియల్‌ను స్వీకరిస్తారు.
11 గంటలకే రిపోర్ట్ చేయాలి..
పోలింగ్ సిబ్బంది మాత్రం ఉదయం 11 గంటలకు పోలింగ్ కేంద్రాల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. భువనగిరి డివిజన్‌ను 5 రూట్లు, 5 జోన్లు గాను, చౌటుప్పల్ డివిజన్ ను 3 రూట్లు, 3 జోన్లుగా ఏర్పాటు చేశారు. ప్రతి రూటుకు ఒక జోనల్ ఆఫీసర్, రూట్ ఆఫీసర్‌ను నియమిం చారు. పోలింగ్ కేంద్రాలకు మెటీరియల్ తో పాటు మధ్యాహ్నం 1గంటకు చేరుకొని మరు నాడు నిర్వహించే పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసుకోవాల్సి ఉంటుంది. చౌటుప్పల్ డివిజన్ కు సంబంధించి 85 మంది పీవో, ఏపీఓలను 151 మంది ఓపీవోలను, భువనగిరి డివిజన్లో 125 పీవో, ఏపీవోలతో పాటు 250 ఓపీవోలు విధులు నిర్వహిస్తు న్నారు. మొత్తం 210 పీవో, ఏపీవోలు, 406 మంది ఓపీవోలు ఎన్నికల విధుల్లో పాల్గొం టున్నారు. శనివారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 నుంచి ఓట్ల లెక్కింపు ప్రారం భిస్తారు. ఈ నెల 16న ఆయా సొసైటీల్లో అధ్య క్షులు, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు. మండ ల ప్రత్యేకాధికారులు సహకార ఎన్నికల ప్రక్రి యను పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తారు.
భారీ బందోబస్తు..
ఎన్నికల నిర్వహణకు భారీ బందోబస్తును ఏర్పా టు చేస్తున్నారు. ముగ్గురు ఏపీపీలు, డీసీపీ నా రాయణరెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తుకు చర్యలు తీసుకుంటున్నారు. పోలింగ్ సిబ్బందితో పాటే పోలీసు బలగాలు కూడా ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకునేలా బస్సులను ఏర్పాటు చేశారు. రవాణా శాఖ అధికారులు స్కూలు బస్సులను ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
- ‘చెక్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్..నితిన్‌కు షాక్..!
- మెదక్ జిల్లాలో చిరుత కలకలం
- రేపటి నుంచి సుప్రీంకోర్టు జడ్జిలకు వ్యాక్సినేషన్
- నెల రోజులే కనిపించే గ్రామం
- అవినీతి ఏఐఏడీఎంకేతో కాషాయ పార్టీ దోస్తీ : స్టాలిన్
- సత్యం మృతిపై సంతాపం వ్యక్తం చేసిన మహేష్ బిగాల
- యూకే, ఆఫ్రికా, బ్రెజిల్ స్ట్రెయిన్ కరోనా కేసులు 213
- అఫ్రిది వయసెంతో అతనికైనా తెలుసా?
- బెంగాల్లో 8 దశల్లో ఎన్నికలు వద్దు
- లావణ్య త్రిపాఠి ఎంటర్టైనింగ్ పర్సన్: రామ్