రైతు పక్షపాతి సీఎం కేసీఆర్

- రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి
గుండాల : తెలంగాణను అన్నపూర్ణ రాష్ట్రంగా మార్చడం కోసం రైతున్నల కోసం నిరంతరం ఆలోచించే రైతుల పక్షపాతి మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో రైతులకు పథకాలు రైతులకు 24 గంటల ఉచిత కరెంట్, సాగునీరు, రైతు బీమా, పంట పెట్టుబడి పంటకు గిట్టుబాటు ధరను అందిస్తున్న మన నాయకుడు కేసీఆర్ వెంట మన రైతన్నలందరూ ఉంటారన్నారు. గత 60 సంవత్సరాల పాలనలో ఏ ప్రభుత్వాలు కూడా రైతుల గురించి ఆలోచించిన దాఖలాలు లేవని రైతు కోసం నిరంతరం ఆలోచించే ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్ట్‌లకు స్వీకారం చుట్టడంతో పాటు కాకతీయుల కాలంలో నిర్మించిన పురాత చెరువులకు మిషన్ కాకతీయలాంటి పనులకు స్వీకారం చుట్టి పురాతన చెరువులకు పూర్వవైభవం తీసుకువచ్చిన నాయకుడు కేసీఆర్ అన్నారు. ఈ నెల 15న జరిగే సహకార ఎన్నికల్లో రైతులందరూ కేసీఆర్ పక్షాన ఉండి ఆలేరు నియోజకవర్గంలోని 8 సహకార సంఘాల్లో గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమన్నా రు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఇమ్మడి దశరథ, ఎంపీపీ తాండ్ర అమరావతి, జడ్పీకో ఆప్షన్ సభ్యులు మహ్మద్‌ఖలీల్, వైస్ ఎం పీపీ మహేశ్వరం మహేందర్‌రెడ్డి, మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ గడ్డమీది పాండరి, సింగిల్‌విండో చైర్మన్ గార్లపాటి సోమిరెడ్డి, మాజీ ఎంపీపీ సంగివేణుగోపాల్, మాజీ జడ్పీటీసీ సభ్యులు మందడి రామకృష్ణారెడ్డి, కోలుకొండ యాదగిరి, నాయకులు చిందంప్రకాశ్, మువ్వల శ్రీనివాస్, ఉప్పలయ్య, మాధవరెడ్డి, రంగారెడ్డి సుధాకర్, శ్రీనివాస్, రాజు, రామ్మలు, బాల్‌రెడ్డి, రాఘవులు, సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ నాయకుల సస్పెన్షన్..
టీఆర్ఎస్ పార్టీలో ఉంటూ పార్టీ వ్యతిరేఖ కార్యక్రమాలకు పాల్పడిన టీఆర్ఎస్ నాయకులను గురువారం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఇమ్మడి దశరథ మండలపరిధిలోని తుర్కలశాపూరం మాజీ సర్పంచ్ పురుగుల మల్లేశ్, వస్తకొండూరు మాజీ ఎంపీటీసీ లింగాలభిక్షం, సితరాంపూరం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఉర్మట్ల రాంరెడ్డిని పార్టీ నుంచి 6 సం వత్సరాలు సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
తాజావార్తలు
- విదేశీ నిపుణులకు అమెరికా వీసాపై బ్యాన్ విత్‌డ్రా
- ప్రతి ట్వీట్‌కూ హ్యాకింగ్ లేబుల్ వార్నింగ్.. ఎందుకంటే..!
- లీటర్ పెట్రోల్ ధర రూ.100.. ఇక కామనే.. మోత మోగుడు ఖాయం
- మ్యాన్‌హోల్‌లో చిక్కుకుని నలుగురు మృతి
- ఉత్తమ రైతు మల్లికార్జున్‌రెడ్డికి ఎమ్మెల్సీ కవిత సన్మానం
- దేశ చట్టాలకు లోబడే సోషల్ మీడియా: అమిత్‌షా
- గల్ఫ్ ఏజెంట్‌పై కత్తితో దాడి
- సీఎం కేజ్రీవాల్ భద్రతను తగ్గించలేదు: ఢిల్లీ పోలీసులు
- బాలికను వేధించిన ఏడుగురు యువకులపై కేసు నమోదు
- ఓయూ.. వివిధ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు