గురువారం 04 మార్చి 2021
Yadadri - Feb 11, 2020 , 23:48:34

ప్రతి గ్రామంపై నిరంతరం నిఘా

ప్రతి గ్రామంపై నిరంతరం నిఘా

మోత్కూరు, నమస్తే తెలంగాణ: జిల్లాలోని ప్రతీ పల్లెపై నిరంతరం నిఘా కొనసాగుతుందని డీసీపీ నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని అంగడి బజార్‌, గడిబజార్‌లో కార్డన్‌సెర్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ మున్సిపాలిటీ కేంద్రంలోని అన్ని వీధుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అందుకు దాతలు తమ వంతుగా సహకరించాలన్నారు. ఆపద సమయంలో 100కు కాల్‌ చేయాలని తెలిపారు .అనంతరం పోలీసులు పట్టణంలోని పలు ఇండ్లలో సోదాలను నిర్వహించి  పత్రాలు సరిగా లేని 41 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో ఏసీపీలు  బొట్టు కిష్టయ్య, సత్తయ్య, సీఐలు ఏవీ రంగా, శ్రీనివాస్‌, ఎస్సై సీహెచ్‌.హరిప్రసాద్‌ తో పాటు 130 పోలీసులు  పాల్గొన్నారు.


VIDEOS

logo