సోమవారం 01 మార్చి 2021
Yadadri - Feb 11, 2020 , 23:47:23

‘సీఎం కేసీఆర్‌ కథాగానం’ పాట చిత్రీకరణ

‘సీఎం కేసీఆర్‌ కథాగానం’ పాట చిత్రీకరణ

నల్లగొండకల్చరల్‌: జీఎంసీ టెలివిజన్‌ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ పీఆర్‌ఓ మెట్ట సైదిరెడ్డి ప్రొడ్యూస్‌ చేస్తున్న ‘సీఎం కేసీఆర్‌ కథాగానం’ పాట చిత్రీకరణ మంగళవారం మ్యూజిక్‌ డైరెక్టర్‌, గాయకుడు చరణ్‌ అర్జున్‌ పర్యవేక్షణలో నల్లగొండ పట్టణంలోని వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పార్కులో చిన్నారుల కూచిపూడి నృత్య కళా రూపకాలను చిత్రీకరించారు. ఈ సందర్భంగా మ్యూజిక్‌ డైరెక్టర్‌ చరణ్‌ అర్జున్‌ మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా, పార్టీలకతీతంగా గొప్ప వ్యక్తుల కథనాలు పాట రూపంలో చిత్రీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే జార్జిరెడ్డి పాట చిత్రీకరణ చేసామని ఇప్పుడు సీఎం కేసీఆర్‌ కథాగానాన్ని నిర్మిస్తున్నామన్నారు. గొప్ప వ్యక్తుల చరిత్రలను భవిష్యత్‌ తరాలకు గ్రంథాలయాల్లో పాటల రూపంలో పొందుపరుస్తున్నామన్నారు. దీనికి జీఎంసీ టెలివిజన్‌ నిర్వహకులు కొండేటి మల్లేష్‌ సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు.  నల్లగొండ గద్దర్‌ నర్సింహారెడ్డి, వాణి వల్లాల, మంగ్లీ వంటి గాయకులు ఈ కథనానికి పాటలు పాడారు. ఈ కార్యక్రమంలో కెమెరామెన్‌ నవీన్‌కుమార్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌, వంశీ, కూచిపూడి నృత్య కళాకారిణి నాగదుర్గ బృందం తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo