పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు

- టీఆర్ఎస్ నుంచి ఎడ్ల సత్తిరెడ్డి సస్పెన్షన్
భువనగిరి,నమస్తే తెలంగాణ : టీఆర్ఎస్ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా ఊరుకునేది లేదని టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు జనగాం పాండు అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భువనగిరి ఎన్నికల్లో భాగంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన భువనగిరి పీఏసీఎస్ మాజీ చైర్మన్ ఎడ్ల సత్తిరెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా ఊరుకునేది లేదన్నారు. సహకార ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు భారీ మెజార్టీలతో గెలిచి సహకార పీఠాలను అధిష్ఠిస్తారన్నారు. పార్టీకి నమ్మకంగా ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేవారందరూ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి, జెడ్పీటీసీ సభ్యులు సుబ్బూరు బీరుమల్లయ్య, మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అబ్బగాని వెంకట్‌గౌడ్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు నల్లమాసు రమేశ్‌గౌడ్, చందుపట్ల రాజేశ్వర్‌రావు, చిక్క ప్రభాకర్‌గౌడ్, నోముల పరమేశ్వర్‌రెడ్డి, సిలువేరు ఏసు వివిద గ్రామాల సర్పంచ్‌లు చిందం మల్లికార్జున్, కడమంచి ప్రభాకర్, బోయిని పాండు, ఎంపీటీసీ సభ్యులు రాసాల మల్లేశం, సామల వెంకటేశం, టీఆర్ఎస్ నాయకులు నీల ఓంప్రకాశ్‌గౌడ్, జక్క రాఘవేందర్‌రెడ్డి, పుట్ట వీరేశ్‌యాదవ్, గౌరారం నరేశ్, నల్లమాసు సత్యనారాయణ, మట్ట ధనుంజయగౌడ్, శ్రీశైలం, సిలువేరు మధు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ నుంచి పలువురి సస్పెన్షన్
బీబీనగర్: మండలంలోని నెమురగొముల గ్రామంలో టీఆర్ఎస్లో కొనసాగుతూ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న పలువురి నాయకులను ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఆదే శానుసారం పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాస్, కార్యదర్శి చింతల సుదర్శన్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సింగిల్‌విండో ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని కాదని రెబల్‌గా నిలబడిన కుర్మిండ్ల చంద్రమణి తనకు మద్దతు దారులుగా నిలిచిన కురిమిండ్ల కృష్ణారెడ్డి, ఆముదాల పాండుగౌడ్, కుర్మిండ్ల ప్రభాకర్రెడ్డిలతోపాటు గ్రామం లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్న మెట్టు మోహన్‌రెడ్డిని సస్పెండ్ చేసినట్లు మండల అధ్యక్షుడు శ్రీనివాసులు పేర్కొన్నారు. ఇకపై టీఆర్ఎస్ పార్టీకి వారికి ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. సింగిల్ విండో ఎన్నికల్లో పార్టీ బలపరిచిన డైరెక్టర్ అభ్యర్థుల గెలుపునకు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని ఆయన సూచించారు.
తాజావార్తలు
- రోజూ పరగడుపునే బీట్రూట్ జ్యూస్ తాగితే..?
- మోదీజీ.. ఇప్పుడేం చెబుతారు? వీడియోలు రిలీజ్ చేసిన కేటీఆర్
- రాష్ట్రంలో ఆడియాలజీ కాలేజీ ఏర్పాటు
- హెచ్డీఎఫ్సీ హోంలోన్ చౌక.. ఎలాగంటే.. !!
- అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత
- ఏంటి పవన్‌కు నాల్గో భార్యగా వెళ్తావా..నెటిజన్స్ సెటైర్లు..!
- ధోనీ సమావేశంలో తోపులాట, పోలీసుల లాఠీచార్జీ
- పాప చక్కగా పాలు తాగేందుకు.. ఓ తండ్రి కొత్త టెక్నిక్
- ఎన్‌పీఎస్‌లో పాక్షిక విత్‌డ్రాయల్స్ కోసం ఏం చేయాలంటే..?!
- జనగామ జిల్లాలో బాలిక అదృశ్యం