శుక్రవారం 05 మార్చి 2021
Yadadri - Feb 11, 2020 , 00:14:52

యాదాద్రిలో భక్తుల సందడి

యాదాద్రిలో భక్తుల సందడి

యాదగిరిగుట్ట, నమస్తేతెలంగాణ : యాదాద్రికొండపై వేంచేసి ఉన్న శ్రీ పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వర స్వామివారికి సోమవారం రుద్రాభిషేకం నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తజనులు పరవశంతో పాల్గొని రుద్రాభిషేకం జరిపించారు. యాదాద్రి కొండపై శివకేశవులను దర్శించుకునే అద్భుతమైన అవకాశం ఉండటంతో రామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసిన వెంటనే యాదాద్రీశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రభాత వేళలో మొదటగా గంటన్నర పాటు శివుడిని కొలుస్తూ జరిగిన రుద్రాభిషేకంలో మమేకమయ్యారు. ఉదయాన్నే శివుడికి ఆవుపాలు, పంచామృతాలతో అభిషేకం చేశారు. పంచామృతాల్లో శివలింగాన్ని అర్చించారు. అభిషేక ప్రియుడైన శివుడిని విభూతితో ఆలంకరించారు. ఆలయంలోని సుబ్రహ్మణ్యస్వామి, మహాగణపతి, ఆంజనేయస్వామి, నాగదేవత విగ్రహాలకు అభిషేకం చేసి అర్చన చేశారు. ప్రభాత వేళ జరిగే రుద్రాభిషేకంలో పాల్గొని శివుడిని ఆరాధించి ప్రత్యేక పూజలు చేయడం ద్వారా శుభం చేకూరుతుందని భక్తుల విశ్వాసం. శివాలయం ఉప ప్రధాన పురోహితులు గౌరీబట్ల నర్సింహరాములు శర్మ ఆధ్వర్యంలో విశేష పుష్పాలంకరణ జరిపారు. నిత్యపూజలు ఉదయం నాలుగు గంటల నుంచి మొదలయ్యాయి. శ్రీ లక్ష్మీనరసింహుని బాలాలయంలో శ్రీ సుదర్శన నారసింహ మహాయాగం, నిత్య కల్యాణోత్సవంలో పాల్గొన్నారు.


స్వామివారి దర్శించుకున్న పలువురు ప్రముఖులు..

స్వామి వారిని నెట్‌వర్క్‌ ఆఫ్‌ పర్సన్‌ విత్‌ డిజేబుల్‌ ఆర్గనైజర్స్‌ జనరల్‌ ఢిల్లీ విభాగం సెక్రటరీ ప్రదీప్‌రాజ్‌, చీఫ్‌ ఆడ్మినిస్ట్రేటర్‌ రాహుల్‌స్వామి, జిల్లా కన్వీనర్‌ సర్దార్‌ శీతల్‌సింగ్‌ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. 


శ్రీవారి ఖాజానాకు రూ.11,29,689 ఆదాయం..

శ్రీవారి ఖజానాకు రూ.11,29,689 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రధాన బుకింగ్‌తో రూ.1,28,766, కల్యాణకట్ట ద్వారా రూ.24వేలు వ్రతాల ద్వారా రూ.66,500, ప్రసాద విక్రయాలతో రూ.5,47,450, శాశ్వతపూజల ద్వా రా రూ.26,232, అన్ని విభాగాల నుంచి ఖజానాకు రూ.11,29,689 ఆదాయం సమకూరినట్లు తెలిపారు.

VIDEOS

logo