మంగళవారం 20 అక్టోబర్ 2020
Yadadri - Feb 10, 2020 , 00:21:58

వృద్ధులకు చేయూతనందించాలి

వృద్ధులకు చేయూతనందించాలిచౌటుప్పల్‌ రూరల్‌: ప్రస్తుత సమాజంలో వస్తున్న  మార్పుల మూలంగా వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేయాల్సివస్తున్నది ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని పెద్దకొండూర్‌లో మేరెడ్డి సత్యనారాయణరెడ్డి, జానకమ్మ దంపతులు నిర్మించిన భవనంలో రెడ్‌క్రాస్‌ సొసైటీ సహకారంతో సాయి యాదాద్రి సేవా ఆశ్రమం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వానప్రస్థ ఆశ్రమ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు తెలివితేటలు ఎక్కువై తల్లిదండ్రులు, అత్తా, మామల బంధావ్యాలను  మర్చిపోతున్నారని స్పష్టం చేశారు. కేవలం అనాథలకు, ఒంటరి స్త్రీలకు ఇలాంటి ఆశ్రమాలు అవసరమన్నారు. వారి కోసం ప్రభుత్వం పెన్షన్లు సైతం మంజూరు చేస్తుందని గుర్తు చేశారు.  సత్యనారాయణ దంపతుల నిర్ణయం గొప్పదన్నారు. వారి ఆలోచనలు ఇతరులకు ఆదర్శమని కొనియాడారు. చాలామంది వద్ద సంపద ఉన్నా.. దయగుణం మాత్రం లేదని పేర్కొన్నారు. సంపాదనలో కొంత సమాజ సేవ కోసం ఖర్చు చేసి ప్రజల మేలుకోరేవారు నేటి ఆధునిక చాలా తక్కువగా ఉంటారని చెప్పారు. స్వాతంత్య్రం రాక పూర్వం దాన ధర్మాలు బాగుండేవని ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా ఆశ్రమ నిర్వహణకు రెడ్‌క్రాస్‌ సొసైటీ, యాదాద్రి సేవా ఆశ్రమం ముందుకురావడం హర్షనీయమన్నారు. రెడ్‌క్రాస్‌ సొసైటీకి ప్రపంచలో మంచి గుర్తింపు ఉందన్నారు.  కార్యక్రమంలో జడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి, స్థానిక సర్పంచ్‌ కాయితీ రమేశ్‌గౌడ్‌, ఎంపీటీసీ బద్దం కొండల్‌రెడ్డి, శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి కృష్ణావేణి, రెడ్‌క్రాస్‌ సొసైటీ రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ మధన్‌మోహన్‌, జిల్లా చైర్మన్‌ లక్ష్మీనర్సింహరెడ్డి, ఆశ్రమ నిర్వహకులు శెట్టి, అశోక్‌ పాల్గొన్నారు. logo