సోమవారం 26 అక్టోబర్ 2020
Yadadri - Feb 08, 2020 , 23:30:48

క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి

క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి
  • కలెక్టర్‌ అనితారామచంద్రన్‌

భువనగిరి అర్బన్‌: విద్యార్థులు విద్యతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ అన్నారు. పట్టణంలోని మదర్‌ థెరిస్సా పాఠశాలలో శనివారం రాష్ట్రస్థాయి సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా  పోటీలు నిర్వహించారు. తెలంగాణ ఎడ్యుకేషన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ ఆధ్వర్యంలో విద్యోత్సవం-2020లో భాగంగా నిర్వహించిన ఈ పోటీల్లో రాష్ట్రంలోని 124 కేరళ యాజమాన్యాల ఆధ్వర్యంలో నిర్వహించే పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ జ్యోతి ప్రజ్వళన చేసి, క్రీడా జ్యోతిని వెలింగించి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యార్థులను ప్రోత్సహించే బాధ్యత ఉపాధ్యాలయులదేనన్నారు. క్రీడలతో మానసికోల్లాసం పెంపొందుతుందన్నారు. గెలుపోటములు సహజమని.. పట్టుదలతో ముందుకు సాగాలన్నారు. విద్యార్థులు ఉన్నతస్థాయికి చేరితే ఆ గొప్పతనం ఉపాధ్యాయులకే దక్కుతుందన్నారు. విద్యార్థులు తాము ఎంచుకున్న క్రీడలపై ఆసక్తి పెంచే విధంగా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో డీసీపీ నారాయణరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ ఎనబోయిన ఆంజనేయులు, ఏసీపీ భుజంగరావు, డీఈవో విజయరావు, సీఐ కాశిరెడ్డి, వార్డు కౌన్సిలర్‌ హేమలత, పాఠశాల చైర్మన్‌ లిబ్బి బెంజిమన్‌, కన్వీనర్‌ సురేశ్‌ పాల్గొన్నారు. 


logo