గురువారం 04 మార్చి 2021
Yadadri - Feb 08, 2020 , 00:25:50

‘సహకార’ సందడి

‘సహకార’ సందడి

సహకార సంఘాల నామినేషన్ల పర్వం కొనసాగుతున్నది. జిల్లాలోని 273 స్థానాలకు శుక్రవారం రెండో రోజు 432 నామినేషన్లను అధికారులు స్వీకరించారు. అత్యధికంగా గుండాల పీఏసీఎస్‌లో 34, అత్యల్పంగా జూలూరు పీఏసీఎస్‌లో 10 నామినేషన్లు దాఖలయ్యాయి. నేడు మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుండటంతో మిగిలిన అభ్యర్థులు తమ నామినేషన్లు వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భువనగిరి పీఏసీఎస్‌లో 3వ వార్డు నుంచి డైరెక్టర్‌గా నామినేషన్‌ వేస్తున్న చైర్మన్‌ అభ్యర్థి నోముల పరమేశ్వర్‌రెడ్డికి అండగా భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి నాయకులు, కార్యకర్తలతో భారీగా తరలివచ్చి నామినేషన్‌ దాఖలు చేయించారు. వంగపల్లిలో టీఆర్‌ఎస్‌ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో 13 మంది నామినేషన్లు దాఖలు చేశారు.

  • రెండో రోజు 432 నామినేషన్లు దాఖలు
  • అత్యధికంగా గుండాలలో 34, అత్యల్పంగా జూలూరులో 10 నామినేషన్లు

యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ : సహకార సంఘాల నామినేషన్ల పర్వం శరవేగంగా సాగుతున్నది. రెండవ రోజులో భాగంగా పోటీ చేసే అభ్యర్థులు భారీగా చేరుకుని తమ నామినేషన్ల దాఖలు చేశారు. జిల్లాలోని 273 స్థానాలకు గానూ రెండవ రోజు 432 నామినేషన్లు అధికారులు స్వీకరించారు. అత్యధికంగా గుండాల పీఏసీఎస్‌లో 34, అత్యల్పంగా జూలురు పీఏసీఎస్‌లో 10 నామినేషన్లు దాఖలయ్యాయి. మిగతా అన్ని పీఏసీఎస్‌లో నామ మాత్రంగానే నామినేషన్లు వేశారు. నేడు మధ్యా హ్నం 3గంటలకు నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుండటంతో మిగిలిన అభ్యర్థులు తమ నామినేషన్లు వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భువనగిరి పీఏసీఎస్‌లో 3వ వార్డ్‌ నుంచి డైరెక్టర్‌గా నామినేషన్‌ వేస్తున్న  చైర్మన్‌ అభ్యర్ధి నోముల పరమేశ్వర్‌రెడ్డికి అండగా భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి మంది మార్భలంతో భారీ గా తరలివచ్చి నామినేన్‌ దాఖలు చేశారు. వంగపల్లిలో టీఆర్‌ఎస్‌ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి తన ఆధ్వర్యంలో 13 మంది ఒకేసారి నామినేషన్లు దాఖలు చేశారు.

వంగపల్లి పీఏసీఎస్‌ చైర్మన్‌ అభ్యర్ధిగా మహేందర్‌రెడ్డి తన పాలకవర్గ సభ్యుల పేర్లను ఖరారు చేసుకుని ఒకేసారి నామినేషన్లు వేయడంతో గ్రామంలో సందడి నెలకొంది. ప్రత్యర్థ్ధులకు భయాన్ని కలిగించారు. రెండవ రోజు నామినేషన్ల పర్వం భారీగానే కొనసాగింది. నామినేషన్లు వేసేందుకు నేడు మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం ఉండటంతో పోటీ దారులు నామినేషన్లు వేసేందుకు ఆసక్తి చూపారు. పార్టీల నుంచి హామీ కోసం కొంత మంది పోటీదారులు వేచిచూడగా చాలా వరకు శుక్రవారం మంచి ముహుర్తం ఉండటంతో నామినేషన్లు వేశారు. సమయం సమీపిస్తుండటంతో రేపు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలున్నాయి. నామినేషన్‌ కేంద్రాల్లో ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లను చేపట్టారు. నిబంధనల ప్రకారం అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు. 


జిల్లాలో 432 నామినేషన్లు దాఖలు..

   2వ రోజులో భాగంగా జిల్లాలోని 21 పీఏసీఎస్‌లలో  273 వార్డులకు గానూ  432 నామినేషన్లు దాఖలయ్యా యి. ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం గురువారం నుంచి నామినేషన్లు అధికారులు స్వీకరించారు. తొలి రోజు జిల్లా వ్యాప్తంగా 70 నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం 2వ రోజు ఏకంగా 432 నామినేషన్లు దాఖలు కావడంతో 2 రోజులు కలుపుకుని మొత్తం 502 నామినేషన్లు వచ్చాయని డీసీవో వెంకట్‌రెడ్డి తెలిపారు. దాదాపుగా టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులు ఒకటి, రెండు మినహా అన్ని వార్డుల్లో నామినేషన్లు దాఖలు చేయగా ప్రతిపక్ష కాంగ్రెస్‌ బలపరిచిన అభ్యర్థులు మాత్రం నామినేషన్లు వేసేందుకు ఆలోచిస్తున్నారు. 

అభ్యర్థుల కోసం వేట..

  సహకార సంఘాల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కోసం ఆయా పార్టీల నాయకులు వేట ప్రారంభించారు. నేడు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల గడువు ఉండటంతో సహకార ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి అంతగా లేకపోయినా, నాయకుల ఒత్తిళ్లమేరకు అభ్యర్థులు ముందుకురాక తప్పడం లేదు. ఉత్సాహం ఉన్నవారికి ఓటు హక్కు లేకపోవడంలాంటి చర్యలతో నాయకులు సరియైన అభ్యర్థుల కోసం వేటను కొనసాగిస్తున్నారు. గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థలైన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో రిజర్వేషన్లు కలిసిరాని ఆశావహులు ప్రస్తుతం కొన్ని చోట్ల పోటీ చేసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. 

VIDEOS

logo