శనివారం 06 మార్చి 2021
Yadadri - Feb 08, 2020 , 00:17:31

సల్లంగా దీవించు సమక్క తల్లి

సల్లంగా దీవించు సమక్క తల్లి
  • కనుల పండువగా చిన్నమేడారం జాతర
  • చిన్నమేడారానికి పోటెత్తిన భక్తజనం
  • పెద్ద ఎత్తున వనదేవతలను దర్శించుకున్న భక్తులు
  • వనదేవతల ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి
  • నేడు వనప్రవేశంతో ముగియనున్న జాతర

రాజాపేట : భక్తులకు కోరిన కోర్కెలు తీర్చి కొంగుబంగారంగా నిలిచే సమక్క- సారలమ్మ వనదేవతల జాతర శుక్రవారం  మండలంలోని చిన్నమేడారంలో నాల్గవ రోజు కనుల పండువగా కొనసాగింది. వనదేవతలు గద్దెలపై ఆగమనంతో భక్తులు మొక్కులు చెల్లించుకోవడానికి పెద్ద ఎత్తున్న సమక్క- సారలమ్మ గద్దెలను  దర్శించుకొని సల్లంగా దీవించు తల్లీఅని మనుసారా వేడుకున్నారు. వనదేవతల గద్దెల ప్రాగంణంలో భక్తుల కొలాహలంతో భక్తిభావం ఉప్పొంగిపోయింది. ఈ సందర్భంగా భక్తులు అడవితల్లులకు మహిళలు వడిబియ్యాలు, పసుపు, కుంకుమ, గాజులు. నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకొని తన్మయత్వం చెందారు. నేడు వనదేవతలకు తిరిగి వనప్రవేశంతో జన జారత ముగియనుంది. జాతరలో  ఏలాం టి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా  సీఐలు నర్సయ్య, శ్రయ  ట్రాఫిక్‌ సీఐ కృష్ణరాజు,  ఎస్సైలు శివకుమార్‌, వెంకన్న ఆధ్వర్యంలో భారీ పోలీస్‌ బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు చింతల ఐలమ్మ, తిరుపతమ్మ, ట్రస్ట్‌ చైర్మన్‌ చింతల అంజయ్య, కార్యదర్శి సంపత్‌, చింతల సత్తయ్య, మహేందర్‌, కుమార్‌ఉన్నారు. 


వనదేవతల దయతో ప్రజలు సల్లంగా ఉండాలి...
 ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి

  చిన్నమేడారం వనదేవతలను ప్రభుత్వ విప్‌ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిలువెత్తు బంగారాన్ని వనదేవతలకు సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వనదేవతల దయతో ఆలేరు నియోజక ప్రజలంతా చల్లంగా ఉండేలా, రాబోయే వర్షకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పండి సుఖసంతోషాలతో ఉండేలా దీవించు తల్లియని వేడుకున్నారు. ఆమె వెంట జడ్పీటీసీ చామకూర గోపాల్‌గౌడ్‌, ఎంపీపీ గోపగోని బాలమణీయాదగిరిగౌడ్‌, ఎంపీటీసీ కవితాతిరుపతిరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు నాగిర్తి రాజిరెడ్డి, టీఆర్‌ఎస్‌ మహిళాధ్యక్షురాలు ఎడ్ల బాలలక్ష్మి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

జాతరలో ప్రభుత్వ విప్‌ షాపింగ్‌...

రాజాపేట : మండలంలోని చిన్నమేడారం ఆలయాన్ని సందర్శించిన ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జాతరలో షాపింగ్‌ నిర్వహించారు. వివిధ దుకాణాలను తిరుగుతూ వ్యాపారులను యోగ క్షేమాలు అడిగి తెలుసుకుంటూ గంట పాటు షాపింగ్‌ నిర్వహించారు. ఆమె వెంట ఎంపీపీ గోపగోని బాలమణీయాదగిరిగౌడ్‌, జడ్పీటీసీ చామకూర గోపాల్‌గౌడ్‌, ఆలేరు మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ రాపోలు లక్ష్మారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు నాగిర్తి రాజిరెడ్డి, మహిళాధ్యక్షురాలు ఎడ్ల బాలలక్ష్మి, ఎంపీటీసీ రాపోలు కవితాతిరుపతిరెడ్డి, సర్పంచ్‌లు మమత, పరిమళ, రాణి తదితరులున్నారు.


సీతారాంపురంలో.. 
కొనసాగుతున్న సమ్మక్క-సారక్క జాతర

గుండాల :   సీతారాంపురంలో సమ్మక్క-సారక్క జాతర సందర్భంగా 3వ రోజు శుక్రవారం అమ్మవార్లు గద్దెల మీద నుంచి భక్తులకు దర్శనమివ్వడంతో పాటు భక్తులు అమ్మవార్లకు మొక్కులు తీర్చుకునే కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు భారీ సంఖ్యలో సమ్మక్క-సారక్కల గద్దెల వద్దకు చేరుకొని తమ మొక్కులు తీర్చుకున్నారు. సమ్మక్క, సారక్క జాతర సందర్భంగా వివిధ మండలాలు, గ్రామాల నుంచి వచ్చిన భక్తులతో సమ్మక్క, సారక్క గద్దెల వద్ద జనంతో జాతర కోలాహలంగా కొనసాగింది.

VIDEOS

logo