గురువారం 25 ఫిబ్రవరి 2021
Yadadri - Feb 07, 2020 , 00:45:39

ఆలేరు నియోజకవర్గంలో 24 నామినేషన్లు దాఖలు

ఆలేరు నియోజకవర్గంలో 24 నామినేషన్లు దాఖలు

యాదగిరిగుట్ట, నమస్తేతెలంగాణ : సహకార సంఘాల ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. ఆలేరు నియోజకవర్గంలో 8 పీఏసీఎస్ పరిధిలో 24 నామినేషన్లు దాఖాలయ్యాయి. ఒక్కో పీఏసీఎస్‌ను 13 వార్డులుగా విభజించగా 8 పీఏసీఎస్‌లకు గానూ 104 వార్డులున్నాయి. మరోవైపు నామినేషన్ ప్రక్రియలో ప్రారంభం కాగా తొలిరోజు  ఆలేరులో 3, వంగపల్లిలో 2, యాదగిరిగుట్టలో 6, తుర్కపల్లిలో 5, బొమ్మలరామారంలో 6, రాజాపేటలో ఒకటి, గుండాలలో ఒక నామినేషన్  నమోదు కాగా ఆత్మకూరు(ఎం) పీఏసీఎస్‌లో ఒక్క నామినేషన్ సైతం దాఖలు కాలేదు. వంగపల్లి పీఏసీఎస్‌లో టీఆర్‌ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి 3వ వార్డు డైరెక్టర్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా నామినేషన్‌ను ఎన్నికల అధికారి ఉపేందర్‌నాయక్ కు అందజేశారు. 

యాదగిరిగుట్టలో..

యాదగిరిగుట్ట పీఏసీఎస్ పరిధిలో 6 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 13 వార్డులుండగా 6వ వార్డు డైరెక్టర్ అభ్యర్థిగా గంధమల్ల రమాదేవి, 9వ వార్డు డైరెక్టర్ అభ్యర్థులుగా బత్తిని బాలరాజు, బత్తిని ఆనంద్, మల్లారెడ్డి, 10వ వార్డు డైరెక్టర్ అభ్యర్థులుగా కాల్యా లాకు, దీరావత్ జహంగీర్ ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలను అందజేశారు. 

వంగపల్లి పీఏసీఎస్‌లో..

వంగపల్లి పీఏసీఏస్ పరిధిలో మొత్తం 2 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 13 వార్డులుండగా 3వ వార్డు డైరెక్టర్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా టీఆర్‌ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తాజా మాజీ పీఏసీఎస్ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి, 1వ వార్డులో కానుగు భిక్షం గౌడ్ నామినేషన్ పత్రులను ఎన్నికల అధికారి ఉపేందర్ నాయక్‌కు అందజేశారు.   

నామినేషన్ సరళిని పరిశీలించిన అధికారులు..

సహకార సంఘం ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ను ఎన్నికల సూపర్‌వైజర్ కృష్ణమూర్తి పరిశీలించా రు. యాదగిరిగుట్ట, వంగపల్లి పీఏసీఎస్‌లతో పాటు ఆలేరు నియోజకవర్గంలోని పలు పీఏసీఎస్‌లను ప రిశీలించిన ఆయన ఎన్నికల అధికారులకు పలు సూచనలు చేశారు. నామినేషన్ పత్రాల్లో సూచించి న నియమాలను అభ్యర్థులకు తెలియజేసి తప్పులులేకుండా పత్రాలను పూరించేలా చూడాలన్నారు.

VIDEOS

logo