శనివారం 27 ఫిబ్రవరి 2021
Yadadri - Feb 07, 2020 , 00:38:40

పారిశుధ్య నిర్వహణపై నిర్లక్ష్యం తగదు

పారిశుధ్య నిర్వహణపై నిర్లక్ష్యం తగదు

భువనగిరి అర్బన్: పట్టణంలో పారిశుధ్య నిర్వహణపై నిర్లక్ష్యం తగదని మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు అన్నారు. గురువారం భువనగిరి పట్టణం 18వ వార్డులో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్‌గౌడ్‌తో కలిసి ఆయన పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. ఆర్‌బీనగర్‌లోని కెనాడి పార్కులో మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. డ్రైనేజీ, రోడ్లు శుభ్రం, చెత్త కుప్పల తొలగింపు ఎప్పటికప్పుడు చేపట్టాలని అధికారులకు సూచించారు. డ్రైనేజీ, సీసీరోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు.  కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ అందె శంకర్, మున్సిపల్ అధికారులు పట్టాభి, సిబ్బంది తదితరులు  పాల్గొన్నారు.

VIDEOS

logo