ఎన్నికలు ఏవైనా టీఆర్ఎస్కే పట్టం

- దేశ రాజకీయ చరిత్రలో టీఆర్ఎస్ కేంద్ర బిందువు
- చౌటుప్పల్, మోత్కూరు మున్సిపాలిటీల పాలక వర్గాల ప్రమాణ స్వీకారంలో మంత్రి జగదీశ్‌రెడ్డి
- హాజరైన మండలి విప్ కర్నె ప్రభాకర్, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి
మోత్కూరు : సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ..ఎన్నికల ఫలితాల్లో రికార్డులు సృష్టిస్తూ దేశ రాజకీయ చరిత్రలోనే కేంద్ర బిందువుగా మారారని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. బుధవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆరేండ్ల పాలనను ఇతర రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని స్పష్టం చేశారు. దేశప్రజలంతా సీఎం కేసీఆర్ పాలనవైవు చూస్తున్నారన్నారు. ముఖ్యమంత్రిపై ప్రజలకు ఉన్న విశ్వాసంతోనే ఎన్నికలు ఏవైనా గులాబీజెండా ఎగురుతున్నదన్నారు. రాష్ట్రంలో 32 జడ్పీపీఠాలు సైతం కైవసం చేసుకొని దేశంలో సంచలనం స్పష్టించామన్నారు. నూతనంగా ఎన్నికైన మున్సిపల్ పాలక వర్గాలు రాజకీయాలకతీతంగా పనిచేయాలని సూచించారు. సంక్షేమ పథకాలు అందరికీ అందే విధంగా పాలకులు కృషిచేయాలన్నారు. మరోవైపు మోత్కూరులో మున్సిపల్ పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి మంత్రి హాజరయ్యారు.
టీఆర్ఎస్ను ప్రారంభించినప్పుడు అవహేళన చేసిన ప్రతిపక్షాలు కనుమరుగయ్యాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి జగదీశ్‌రెడ్డి అన్నారు. బుధవారం మోత్కూరు మున్సిపల్ చైర్పర్సన్ తీపిరెడ్డి సావిత్రామేఘారెడ్డి, వైస్ చైర్మన్ బొల్లేపల్లి వెంకటయ్య, నూతన పాలకవర్గం సభ్యుల పదవీ బాధ్యతల ప్రమాణస్వీకారోత్సం సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. దేశంలో 60,70 యేండ్లుగా ఏ జాతీయ పార్టీలు, ప్రభుత్వాలు అమలు చేయని గొప్ప సంక్షేమ పథకాలు తెలంగాణలో సీఎం కేసీఆర్ న్యాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. సంక్షేమ పథకాలకు రూ.50 వేల కోట్లకు పైగా నిధులు మంజూరు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నో కుట్రలు చేసిన కాంగ్రెస్, బీజేపీలు అడ్రస్ లేకుండా పోయాయన్నారు. దేశ ప్రజలంతా సీఎం కేసీఆర్ విజన్‌ను కోరుకుంటున్నారని తెలిపారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మాకు కావాలని గుజరాత్, కర్ణాటక రాష్ర్టాల ప్రజలు కోరుకుంటున్నారన్నారు. రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలు దేశంలో ఆదర్శంగా నిలిచాయని వివరించారు. పార్టీలకతీతంగా ప్రజలు అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. దేశానికే ఆదర్శంగా రాష్ర్టాన్ని తీర్చిదిద్దుతూ అటూ అభివృద్ధిలోనూ ఇటు ఎన్నిక ఫలితాల్లోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ రికార్డులు సృష్టిస్తున్నారన్నారు.
భారత దేశంలో టీఆర్ఎస్ సృష్టించిన అద్భుతాలు ఏ పార్టీకి సాధ్యం కాదన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు అసెంబ్లీ ఎన్నికల్లో సరికొత్త రికార్డులు సాధించామని,అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికలు, జడ్పీ చైర్మన్లు ,మున్సిపాలిటీ చైర్మన్లు ఇలా అన్నింటిలో ప్రజలు కేసీఆర్‌కు బాసటగా నిలిచారన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుతూ పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. గ్రామాలు ఆదర్శంగా ఉండాలంటే ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి చేసుకోవాలని కేసీఆర్ పల్లెప్రగతి నిర్వహించారన్నారు. పల్లెప్రగతితో నేడు గ్రామాల రూపురేఖలు మారాయన్నారు. గ్రామాల్లో పచ్చదనంతో పాటు పారిశుధ్యం, పరిశుభ్రత , మురుగు కాల్వలు, సీసీరోడ్లు, నర్సరీల ఏర్పాటు జరిగిందన్నారు. మౌలిక వసతులు కల్పించి గ్రామాలు స్వచ్ఛతమైపు పరుగులు పెట్టాయన్నారు. రాబోవు రోజుల్లో పట్టణాల్లో సైతం ఈకార్యక్రమాన్ని ప్రవేశపెట్టనున్నామని తెలిపారు. మున్సిపాలిటీ పాలకవర్గం వచ్చే ఐదు సంవత్సరాల్లో మనకు ఎవరు పోటీ లేని విధంగా పనిచేసి ప్రజల సమస్యలు పరిష్కరించాలన్నారు. సమష్టి కృషితో పనిచేసి మున్సిపాలిటీ రూపు రేఖలు మార్చాలని సూచించారు. పారిశుధ్యం, పరిశుభ్రత పాటించి ప్రతి ఇంటి ముందు పచ్చనిమొక్కలు ఉండే విధంగా చూడాలని పిలుపునిచ్చారు.
టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే
టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికలో అపూర్వమైన మెజార్టీ స్థానాలను ఇచ్చిన మున్సిపాలిటీ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. గత ఆరు సంవత్సరాలుగా ఇక్కడి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. మోత్కూరు, కొండగడప, బుజిలాపురం గ్రామాలను వీలినం చేసి మున్సిపాలిటీగా మారటం వల్ల ఎంతో అభివృద్ధి జరుగుతుందన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో రాబోవు రోజుల్లో మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు. ఇప్పటికే మున్సిపాలిటీకి రూ.20 కోట్లు మంజూరయ్యాయని ఆయన గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ సాకారం చేసుకుందామన్నారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ తీపిరెడ్డి సావిత్రమేఘారెడ్డి, వైస్ చైర్మన్ బొల్లేపలి వెంకటయ్యలకు కార్యాలయంలోని చాంబర్లో పదవీ బాధ్యతలు అప్పగించారు.
అంతకు ముందు టీఆర్ఎస్ శ్రేణులు పట్టణంలోని పాలశీతలీకరణ కేంద్రం నుంచి మున్సిపాలిటీ కార్యాలయం వరకు భారీ బైక్‌ర్యాలీ నిర్వహించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌కు గజమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు చింతల వరలక్ష్మి, విజయ భాస్కర్‌రెడ్డి సుమారు వంద మంది అనుచరులతో టీఆర్ఎస్లో చేరారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, విద్యామండలి సభ్యుడు ఒంటెద్దు నర్సింహారెడ్డి, మోత్కూరు, అడ్డగూడూరు మండలాల జడ్పీటీసీలు గోరుపల్లి శారద సంతోష్‌రెడ్డి, శ్రీరాముల జ్యోతి అయోధ్య, మార్కెట్ వైస్ చైర్మన్ కొణతం యాకూబ్‌రెడ్డి, మండలాధ్యక్షుడు పొన్నెబోయిన రమేశ్, కార్యదర్శి గజ్జి మల్లేశ్, మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్లు పురుగుల వెంకన్న, వనం స్వామి, దబ్బెటి విజయారమేశ్, బొడ్డుపల్లి కల్యాణ్ చక్రవర్తి, కూరెళ్ల కుమారస్వామి పాల్గొన్నారు.
తాజావార్తలు
- పెట్రోల్‌పై పన్నుల్లో రాష్ట్రాలకూ ఆదాయం: కేంద్ర ఆర్థికమంత్రి
- టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించిన ఆర్‌యూపీపీ, ఎస్‌ఎల్‌టీఏ సంఘాలు
- పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం
- అంబానీ ఇంటి వద్ద కలకలం రేపిన వాహనం యజమాని మృతి
- ఎవరీ పద్మశ్రీ.. దిల్ రాజు ఎక్కడినుంచి పట్టుకొచ్చాడు..?
- రూ.43వేల దిగువకు బంగారం ధర..
- ఆయుష్మాన్ 'డ్రీమ్ గర్ల్' తెలుగు రీమేక్‌కు రెడీ
- అందుకే పెద్ద సంఖ్యలో గురుకులాల స్థాపన
- .. ఆ ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ ఉపసంహరణ
- ఒలింపిక్ జ్యోతిని చేపట్టనున్న శతాధిక వృద్ధురాలు!