బుధవారం 03 మార్చి 2021
Yadadri - Feb 02, 2020 , 23:09:45

క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు కృషి

క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు కృషి

భువనగిరి అర్బన్‌: యువతలో క్రీడా స్ఫూర్తిని పెంచేందుకు కృషి చేస్తున్నట్లు భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో ఆదివారం శాంతి ట్రాక్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో చందాశాంతి రెడ్డి స్మారక దినోత్సవం సందర్భంగా పురుషులకు 5 కేఎం, మహిళలకు 3 కేఎం రాష్ట్రస్థాయి రోడ్‌ రేస్‌ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలోని క్రీడాకారులు శిక్షణ పొందేందుకు భువనగిరి కేంద్రంలో క్రీడా మైదానం ఏర్పాటు కృషి చేస్తానన్నారు. మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ సహకారంతో భువనగిరిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పటికే భువనగిరి ఖిల్లా పర్యాటక కేంద్రంగా అభివృద్ధిలో ఉందన్నారు. పట్టణానికి వచ్చే పర్యాటకుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. పట్టణంలోని ఇండోర్‌ స్టేడియాన్ని క్రీడాకారులకు అనుగుణంగా మరింత అభివృద్ధి చేస్తానన్నారు. జిల్లాలో భువనగిరి పట్టణాన్ని అభివృద్ధిలో ముందుంచుతానని చెప్పారు. అనంతరం రోడ్‌ రేస్‌లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ఈ పోటీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 300 మంది పురుషులు, 100 మంది మహిళలు పాల్గొన్నారు. ప్రథమ బహుమతిగా రూ.10వేలు, ద్వితీయ బహుమతిగా రూ.5వేలు, తృతీయ బహుమతిగా రూ. 3వేలు, నాల్గో బహుమతిగా రూ.2వేలు, ఐదో బహుమతిగా రూ.వెయ్యి, 6 నుంచి 10వరకు రూ.500 అందజేశారు. 


డయల్‌ 100పై అవగాహనఉండాలి..

అత్యవసర నెంబర్‌ డయల్‌ 100పై అవగాహన ఉండాలని డీసీపీ నారాయణరెడ్డి అన్నారు. 100 టోల్‌ ఫ్రి నంబర్‌ వాల్‌ పోస్టర్‌ను ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డితో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారు 100 నంబర్‌కు డయల్‌ చేసి సమచారం అందించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ జడల అమరేందర్‌గౌడ్‌, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరేందర్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ ఎడ్ల సత్తిరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ ఆంజనేయులు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ చింతల కిష్టయ్య, ఏసీపీ భుజంగరావు, పట్టణ సీఐ కాశిరెడ్డి, కౌన్సిలర్లు కిరణ్‌కుమార్‌, భగత్‌, వెంకటేశ్వర్లు, క్రాంతి, నాయకులు రాజేశ్‌, మధు, శంకర్‌, శ్రీనివాస్‌, వెంకటేశ్‌, శాంతి ట్రాక్‌ క్లబ్‌ సభ్యులు  పాల్గొన్నారు.

VIDEOS

logo