మంగళవారం 09 మార్చి 2021
Yadadri - Feb 02, 2020 , 22:57:46

రేపటి నుంచి చిన్నమేడారం జాతర

రేపటి నుంచి చిన్నమేడారం జాతర

రాజాపేట : భక్తులకు కొంగు బంగారంగా నిలిచే చిన్న మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర 4 నుంచి అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది.  తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే వనజాతరకు నిర్వహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 4న ఎల్లమ్మ పెట్టే బోనాలతో జాతర అట్టహాసంగా ప్రారంభకానుంది. 5న కుర్రారం శివారులోని ఎదులగుట్టు నుంచి  సారలమ్మ గద్దెనెక్కుట  6న బూర్గుపల్లి శివారులో గల పులిగుట్ట నుంచి సమ్మక్కను  గద్దెపైకి రావ డం, 7న భక్తుల మొక్కు లు, 8న దేవతల వన ప్రవేశంతో ఉత్సవాలు ముగుస్తాయి. జాతరలో ప్రజల సౌకర్యార్థం మంచినీరు, వీధీ దీపాలను ఏర్పాటు చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేం ద్రం ఆధ్వర్యంలో ప్రత్యే క వైద్యశిబిరాన్ని నిర్వహిస్తారు. జాతరలో ఏలాం టి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాలల్లో పెద్ద ఎత్తున దుకాణాలు, హోటళ్లు, వెలిశాయి. వన జాతరకు జిల్లా నుంచి కాకుండా నలుమూలల నుంచి లక్షలాధిగా భక్తులు వచ్చి వనదేవతలైన సమ్మక్క- సారళమ్మలను భక్తులు దర్శించుకొని   ఒడిబియ్యాలు, తలనీలాలు, నిలువెత్తు బంగారం(బెల్లం) సమర్పించుకొని అనంత భక్తి భావంతో పరవశించిపోతారు. జాతరకు 5 లక్షలకు పైగా భక్తులు వస్తారని అధికారులు  అంచనా వేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి  జాతర ఏర్పాట్లను పరిశీలిం చి, జాతర వచ్చే భక్తులకు ఏలాంటి అసౌకర్యం కలుగకుండా  ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.  

చిన్నమేడారానికి భక్తుల తాకిడి..

రాజాపేట : కొలిచిన వారికి కొంగు బంగారం నిలిచే చిన్నమేడారం వనదేవతల ఆలయానికి ఆదివారం భక్తుల తాకిడి మొదలైయింది. ఈ సందర్భం గా అధిక సంఖ్యలో  భక్తులు సమ్మక్క సారక్క వనదేవతలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు దేవతలకు వడిబియ్యాలు, పసుపు, కుంకుమ, గాజులు సమర్పించుకున్నారు. 

 భక్తుల కోరిన కోరికలు నేరవేరడంతో సమ్మక్క, సారక్క దేవతలకు నిలువెత్తు బంగారం సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కొంత మంది భక్తులు  వన దేవతల గద్దెల ప్రాంగంణలోకి రాకతోనే  పూనకాలతో ఊగిపోయారు. ఈ కార్యక్రమంలో ఆల య పూజారి చింతల ఐలమ్మ, ఆలయట్రస్ట్‌ చైర్మన్‌ చింతల అంజయ్య, ప్రధానకార్యదర్శి చింతల సం పత్‌, భక్తులు పాల్గొన్నారు.  

VIDEOS

logo