బుధవారం 21 అక్టోబర్ 2020
Yadadri - Jan 31, 2020 , 23:49:48

చేపల వేటకు వెళ్లి మృత్యువాత

 చేపల వేటకు వెళ్లి మృత్యువాత

యాదగిరిగుట్ట, నమస్తేతెలంగాణ : చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కుంటలో పడి మృత్యువాత పడ్డారు. ఈ సంఘటన యాదగిరిగుట్ట మండలంలోని మహబూబ్‌పేట గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్‌పేట గ్రామానికి చెందిన ఆరె మల్లేశ్‌గౌడ్‌ (36) గురువారం సాయంత్రం సమయంలో గ్రామ పరిధిలో ఉన్న నీటి కుంటలో చేపల వేటకు వెళ్లి వల వేసి తిరిగి వచ్చారు. శుక్రవారం ఉదయం వలలో చిక్కిన చేపలను తీసుకునేందుకు కుంట వద్దకు వెళ్లారు. కుంటలో దిగిన మల్లేశ్‌ ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. ఉదయం వెళ్లిన మల్లేశ్‌ తిరిగి రాకపోవడంతో అనుమానంతో అతని భార్య కుంట వద్దకు వెళ్లి వెతకగా ఆచూకీ లభించలేదు. గ్రామస్తులు కుంటలోకి దిగి పరిశీలించగా.. నీటిలోని వండ్రు మట్టిలో ఇరుక్కుని విగతజీవిగా మారాడు. మృతుడి భార్య సుజాత ఇచ్చిన ఫిర్యాదుతో నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.


logo