ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Yadadri - Jan 30, 2020 , 23:59:16

ప్రజాసేవకు పెద్దపీట వేయాలి

ప్రజాసేవకు పెద్దపీట వేయాలి

చౌటుప్పల్‌, నమస్తేతెలంగాణ : నూతనంగా ఎన్నికైన మున్సిపల్‌ చైర్మన్‌, కౌన్సిలర్లు ప్రజాసేవకు పెద్దపీట వేయాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ కోరారు. మంత్రి కేటీఆర్‌ను హైదరాబాద్‌లోని టీఆర్‌ఎస్‌ భవన్‌లో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో చౌటుప్పల్‌ మున్సిపల్‌ చైర్మన్‌గా నూతన ఎన్నికైన వెన్‌రెడ్డి రాజు, కౌన్సిలర్లు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రిని పూలమాలలు, శాలువాతో ఘనంగా సన్మానించారు. నూతనంగా ఎన్నికైన చైర్మన్‌, కౌన్సిలర్లకు మంత్రి కేటీఆర్‌ అభినందనలు తెలిపారు. మున్సిపాల్టీ అభివృద్ధికి నిధులు కేటాయిస్తానని తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి, ఎన్నికల పరిశీలకుడు కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ పెద్దిటి బుచ్చిరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు గిర్కంటి నిరంజన్‌గౌడ్‌, మున్సిపాలిటీ కన్వీనర్‌ ఊడుగు శ్రీనివాస్‌గౌడ్‌, దైదా మోహన్‌రెడ్డి, కౌన్సిలర్లు ఎండీ.బాబాషరీఫ్‌, కొరగాని లింగస్వామి, సుల్తాన్‌రాజు, అంతటి బాలరాజు, తాడూరి పరమేశ్‌, బొడిగె బాలకృష్ణగౌడ్‌  పాల్గొన్నారు. 


విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని..

సూర్యాపేటలోని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి నివాసంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో నూతన మున్సిపల్‌ చైర్మన్‌గా ఎన్నికైన వెన్‌రెడ్డి రాజు, కౌన్సిలర్లు గురువారం కలిశారు. పూలమాల, శాలువాతో సన్మానించారు. నూతనంగా ఎన్నికైన చైర్మన్‌, కౌన్సిలర్లను మంత్రి అభినందించారు. మున్సిపాలిటీ అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. తన అండదండలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి, ఎన్నికల పరిశీలకుడు కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ పెద్దిటి బుచ్చిరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు గిర్కంటి నిరంజన్‌గౌడ్‌, మున్సిపాలిటీ కన్వీనర్‌ ఊడుగు శ్రీనివాస్‌గౌడ్‌, దైదా మోహన్‌రెడ్డి, కౌన్సిలర్లు ఎండీ.బాబాషరీఫ్‌, కొరగాని లింగస్వామి, సుల్తాన్‌రాజు, అంతటి బాలరాజు, తాడూరి పరమేశ్‌, బొడిగె బాలకృష్ణగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo