ఆదివారం 07 మార్చి 2021
Yadadri - Jan 30, 2020 , 23:52:49

భూసేకరణ పనులు పూర్తి చేయాలి

భూసేకరణ పనులు పూర్తి చేయాలి

భువనగిరి, నమస్తేతెలంగాణ: ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ కోరారు. గురువారం ఆర్డీవో కార్యాలయంలో గంధమల్ల, బస్వాపూర్‌ ప్రాజెక్టుల ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు, ఆర్డీవోలు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లతో సమావేశమై భూసేకరణ పనుల ప్రగతిని కలెక్టర్‌ సమీక్షించారు. ప్యాకేజీ-15 మెయిన్‌ కెనాల్‌కు సంబంధించి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రిజర్వాయర్‌ నింపడానికి అవసరమైన అన్ని పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా వెంకటాపూర్‌, ముల్కలపల్లితండా, వీరారెడ్డిపల్లి, తుర్కపల్లిలో మిగిలిపోయిన భూసేకరణ పనులు పూర్తి చేయాలన్నారు. ప్యాకేజీ-16కు సంబంధించి బస్వాపూర్‌ రిజర్వాయర్‌ పనుల్లో భాగంగా అక్కడక్కడ మిగిలిపోయిన రాయగిరి, సూరేపల్లి, బొల్లేపల్లిలో భూసేకరణను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ముంపునకు గురయ్యే లక్ష్మీనాయకునితండా, స్వాములనాయకునితండాలో పునరావాస చర్యలు చేపట్టి సకాలంలో పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఆర్డీవో భూపాల్‌రెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టు ఈఈలు హైదర్‌ఖాన్‌, అశోక్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ విజయకుమారి పాల్గొన్నారు.

VIDEOS

logo