సోమవారం 01 మార్చి 2021
Yadadri - Jan 29, 2020 , 23:50:18

హాజీపూర్‌ బాధితులకు అండగా నిలుస్తాం

హాజీపూర్‌ బాధితులకు అండగా నిలుస్తాం

బొమ్మలరామారం: హాజీపూర్‌ బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం బొమ్మలరామారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో బీసీ కార్పోరేషన్‌ నుంచి ఒక్కో కుటుంబానికి మంజూరైన రూ.50 వేల చెక్కును కలెక్టర్‌ అనితారామచంద్రన్‌తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ మాట్లాడుతూ హాజీపూర్‌లో నరరూప రాక్షసుడు శ్రీనివాస్‌రెడ్డి చేతిలో మనీష, శ్రావణి, కల్పన హత్యకు గురి కాగా వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. బాలికలపై లైంగిక దాడి చేసి హత్య చేసిన శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్షే సరైందన్నారు. ఈ కేసులో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నదన్నారు. ఈ కేసు నల్లగొండ ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో నడుస్తుందని.. త్వరలో శిక్ష ఖరారు కానున్నదన్నారు. ఆడపిల్లల సంరక్షణే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారన్నారు. అనంతరం మండలంలోని వివిధ గ్రామాల్లోని లబ్ధిదారులకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద మంజూరైన చెక్కులను అందజేశారు. 


ఫక్కీర్‌గూడెం గ్రామానికి చెందిన మేడబోయిన వెంకటేశ్‌కు రూ.17500వేలు, గంగదేవి గండయ్యకు రూ.17500వేలు, గంగదేవి బాల్‌రాజ్‌ రూ.14500వేలు, జోగు సురేశ్‌ రూ.22500, తూంకుంట గ్రామానికి చెందిన డి.భిక్షపతికి రూ. 25వేలు, మేకల జంగమ్మకు రూ.15వేలు, మైసిరెడ్డిపల్లికి చెందిన కె.బాల్‌రాజ్‌గౌడ్‌కు రూ.15 వేలు, మల్యాలకు చెందిన ఊట్ల పెంటమ్మకు రూ.32500 వేల చొప్పున ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్‌ అనితారామచంద్రన్‌, ఎంపీపీ చిమ్ముల సుధీర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు పొలగౌని వెంకటేశ్‌గౌడ్‌, భువనగిరి మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ రామిడి రాంరెడ్డి, ధీరావత్‌ శ్రీనివాస్‌నాయక్‌, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మేడబోయిన గణేశ్‌, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యుడు గూదె బాల్‌నర్సింహ, నాయకులు వరుగంటి సతీశ్‌గౌడ్‌, మచ్చ శ్రీనివాస్‌గౌడ్‌, పసుల వెంకటేశ్‌, యూత్‌ అధ్యక్షుడు చిమ్ముల శశిధర్‌రెడ్డి, బోనంకూర మల్లేశ్‌, బోయిని నర్సింహ, సర్పంచులు తిరుమల కవితావెంకటేశ్‌గౌడ్‌, నోముల రమాదేవి రాంరెడ్డి, కుర్మిళ్ల దామోదర్‌గౌడ్‌, బట్కీర్‌ బీరప్ప, సుర్వి గోవింద్‌, ఎంపీటీసీ ఫక్కీర్‌ రాజేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్వీ మండలాధ్యక్షుడు ధీరావత్‌ బాల్‌సింగ్‌, ప్రధాన కార్యదర్శి దీరావత్‌ లింగానాయక్‌, రాజన్‌నాయక్‌, తహసీల్దార్‌ పద్మసుందరి, ఇన్‌చార్జి ఎంపీడీవో శేషాద్రి,పలు గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.  

VIDEOS

logo