మంగళవారం 02 మార్చి 2021
Yadadri - Jan 29, 2020 , 02:10:48

కారు అదరహో!

కారు అదరహో!
  • - టీఆర్‌ఎస్‌ ఖాతాలో 40.94 శాతం ఓట్లు
  • - ద్వితీయస్థానంలో కాంగ్రెస్‌
  • - బీజేపీ అంతంతే..
  • - సత్తా చాటిన ఇండిపెండెంట్లు
  • - మొత్తం ఓట్లు 1,17,769
  • - పోలైనవి 1,04,014

యాదగిరిగుట్ట, నమస్తేతెలంగాణ : అన్ని బల్దియాలను క్లీన్‌స్వీప్‌ చేసిన కారు సత్తా చాటింది. మొత్తంగా 40.94 శాతం ఓట్లను తన ఖాతాలో వేసుకుంది. అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే ఓట్ల శాతం పెంచుకొని ఏ మాత్రం ఆదరణ తగ్గలేదని నిరూపించుకున్నది. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లోని 103 వార్డుల్లో పోటీ చేసిన టీఆర్‌ఎస్‌ 51 వార్డులను దక్కించుకొని జిల్లాలోని మొత్తం ఆరు మున్సిపాలిటీల్లో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులను కైవసం చేసుకుంది. ఓట్లు, వార్డుల పరంగా టీఆర్‌ఎస్‌ మొదటిస్థానంలో నిలిచింది. ఇక గతంతో పోలిస్తే కాంగ్రెస్‌, బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం తగ్గడం ఇక్కడ గమనార్హం. ఇరు పార్టీల ఓట్లు  క్రమక్రమంగా తగ్గగా టీఆర్‌ ఎస్‌ మాత్రం పెంచుకోవడం విశేషం. మరోవైపు పుర ఎన్నికల్లో 123 మంది  స్వతంత్రులు బరిలో నిలువగా 9 వార్డులు గెలుపొందడమే కాకుండా కొంత మంది ప్రధాన పార్టీ అభ్యర్థుల కంటే ఎక్కువ ఓట్లు సాధించి సత్తా చాటారు. 


పురపాలిక ఎన్నికల్లో క్లీన్‌స్వీప్‌ చేసుకున్న టీఆర్‌ఎస్‌ పార్టీ తన ఖాతాలో 40.94 శాతం ఓట్లను వేసుకుంది. గత శాసనసభ, గ్రామ పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే ఓట్ల శాతం పెరిగింది. యాదాద్రిభువనగిరి జిల్లా పుర ఎన్నికల్లో 103 వార్డుల్లో పోటీ చేసిన టీఆర్‌ఎస్‌ 51 వార్డులను దక్కించుకొని, జిల్లాలోని మొత్తం 6 మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులను కైవసం చేసుకుంది. ఓట్లు, వార్డుల పరంగా టీఆర్‌ఎస్‌ మొదటిస్థానంలో నిలిచింది. గతంతో పోలిస్తే కాంగ్రెస్‌, బీజేపీకి  వచ్చే ఓట్ల శాతం తగ్గింది. 

      

ఇరు పార్టీల ఓట్ల శాతా న్ని తగించుకుంటూ టీఆర్‌ఎస్‌ ధీటుగా నిలిచింది. పుర ఎన్నికల్లో 123స్వతంత్రులు బరిలో నిలువగా 9 వా ర్డులు గెలుపొందడమే కాకుండా కొంత మంది ప్రధాన పార్టీ అభ్యర్థుల కంటే ఎక్కువ ఓట్లు సాధించి తమ సత్తా చాటుకున్నారు.యాదాద్రిభువనగిరి జిల్లాలోని 6 పురపాలక సం ఘం ఎన్నికలు ఆది నుంచి ఉత్కంఠ భరితంగా సాగాయి. టికెట్లు ఖరారు నుంచి మొదలు పోలింగ్‌, లెక్కింపు తదితర అంశాలపై ఆసక్తి నెలకొంది. కొన్ని వార్డు ల్లో ఫలితాలు తారుమారు కావడం, మరి కొన్ని స్థానాల్లో ఊహించని అభ్యర్థులు గెలుపొందడంతో ఆయా పార్టీలు అంతర్మథనంలో పడ్డాయి. టీఆర్‌ఎస్‌50 స్థానాలకంటే ఎక్కువ స్థా నాలు వస్తాయని లెక్కలు వేసుకోగా, టీఆర్‌ఎస్‌ రెబల్‌, స్వంతంత్రులు పోటీ చేయడం వల్ల తక్కువ ఓట్ల తేడాలో కొన్ని స్థానాలను పొగొట్టుకోవాల్సి వచ్చింది. మొత్తంగా గతంతో పోలిస్తే టీఆర్‌ఎస్‌కు ఈ ధపా ఓట్లశాతం పెరిగింది. 


టీఆర్‌ఎస్‌కు పెరిగిన ఓట్ల శాతం..

గత ఎన్నికలతో పోలిస్తే ఓట్ల శాతం పెరుగడం టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. గత పుర ఎన్నికల్లో 28 శాతం, గత శాసనసభ ఎన్నికల్లో 34.15 శాతం రాగా, ఈ సారి జరిగిన పుర ఎన్నికల్లో 40.94 శాతం ఓట్లను తన ఖాతాల్లో వేసుకొని మొదటి స్థానంలో నిలిచింది. జిల్లాలో మొత్తం 1,17,769 ఓటర్లు ఉండగా గత 22న జరిగిన పురపోలింగ్‌లో 1,04,041 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా ఇందులో 42,588 ఓట్లు కేవలం టీఆర్‌ఎస్‌ పార్టీకే వేశారు. గడిచిన 6ఏండ్ల్ల కాలం లో ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరుతున్నాయి.ప్రపంచం గర్వించే విధంగా యా దాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయ అభివృద్ధి, కాళేశ్వరం ప్రాజెక్టు, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, ఆసరా పింఛన్లు, రైతులకు ఉచిత కరెం ట్‌..ఇలా ప్రభుత్వం చేపట్టిన అనేక పథకాలు ఓటర్లను తమవైపు తిప్పుకునేలా చేశాయి. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టి న సంక్షేమ పథకాలపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని చెప్పడానికి పెరిగిన ఓట్ల శాతమే ఉదాహరణగా చెప్పొచ్చు. 


ద్వితీయ స్థానంలో కాంగ్రెస్‌..

యాదాద్రిభువనగిరి జిల్లాలోని మొత్తం 6 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ పార్టీ 85 అభ్యర్థులను బరిలో నిలిపింది.  28 స్థానాలను కైవసం చేసుకుంది. గత  అసెంబ్లీ ఎన్నికల్లో 32.91 శాతం ఓట్లు సాధించిన కాంగ్రెస్‌ పార్టీ ఈ ఎన్నికల్లో కేవలం 29.41 శాతానికి పరితమైన డీలా పడింది. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలో 1,04,041 ఓట్లు పోల్‌ కాగా ఇందులో కాంగ్రెస్‌కు  30,593 ఓటర్లు మాత్రమే ఓట్లు వేశారు. 60 ఏండ్ల్ల పాలనతో కాంగ్రెస్‌ పార్టీ చేసిన సంక్షేమ పథకాలు కనిపించకుండా పోయాయి. కరెంట్‌ పోయిందంటే ఎప్పుడు వస్తదో తెలియని అయోమయ పరిస్థితుల్లో రైతులు జీవించేవారు. వారివారి రాజకీయ భవిష్యత్‌ కోసమే పనిచేసే స్వార్థరాజకీయ నాయకులు మరోసారి అధికారంలోకి వస్తే ఒరిగెదేమీ ఉండదని ము మ్మాటికి ఓటర్లు విశ్వసిస్తున్నారు. 


బీజేపీపై పెరగని ఆదరణ..

రెండు ధపాలుగా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీకి జిల్లాలో జరిగిన పుర ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయింది. ప్రధానంగా రాష్ర్టానికి రావాల్సిన నిధుల అడ్డుకోవడంతో పాటు ఈ ప్రాంతంపై కేంద్రం చూపుతున్న నిర్లక్ష్యంతో వార్డుల్లో గెలుపు నామ మాత్రగానే ఉన్నా.. 6మున్సిపాలిటీల్లో బీజేపీ తమ ఓటు శాతం తగ్గుముఖం పట్టింది.  6 మున్సిపాలిటీల్లోని  మొత్తం 82 వార్డుల్లో పోటీ చేసిన బీజేపీ 12 మాత్రమే గెలుపొందింది. కొన్ని స్థానాల్లో మాత్రం ధీటైన అభ్యర్థులను పోటీలో దింపలేదనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో 13.77 శాతం ఓట్లు సాధించిన బీజేపీ ఈ ఎన్నికల్లో 12.95 శాతం ఓట్లతో తృతీయ స్థానంలో నిలిచింది. 


సత్తాచాటిన ఇండిపెండెంట్లు..

జిల్లాలో జరిగిన పురపాలిక ఎన్నికల్లో ఇండిపెండెంట్‌ అభ్యర్థులు పోటీలో నిలిచి సత్తాచాటారు. ప్రధాన పార్టీల అభ్యర్థులకు ధీటుగా ప్రచారం చేసి  ఓట్లు సాధించి విజ యం సాధించారు. కొన్ని వార్డుల్లో ఎక్కువ ఓట్లు సాధించి తమ సత్తా చూపారు. మొత్తం జిల్లాలోని ఆరు పురపాలికలో 123 ఇండిపెండెంట్‌ అభ్యర్థులు పోటీలో నిలువగా 9 మంది గెలుపొందారు.1,04,041 ఓట్లు పోల్‌కాగా 9,830ఓట్లు సాధించగా 9.44 శాతంతో నాలుగవ స్థానం లో నిలిచారు. ఆయా మున్సిపాలిటీలోని వార్డుల్లో పోటీ చేసిన ఇండిపెండెంట్‌ అభ్యర్థులు ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులపై ప్రభావం చూపారు. పలు ప్రదేశాలలో గెలుస్తామని భావించిన టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులకు ఇండిపెండెంట్లతో ఓటమి చవిచూశారు. 


VIDEOS

logo