గురువారం 25 ఫిబ్రవరి 2021
Yadadri - Jan 28, 2020 , 00:56:19

పట్టాభిషేకం

పట్టాభిషేకం
  • - గులాబీ జోరుకు కొట్టుకుపోయిన ప్రతిపక్షాలు
  • - జిల్లాలో ఆరుకు 6 పురపాలికలు కారు ఖాతాలోనే..
  • - మెజార్టీతో భూదాన్‌పోచంపల్లి, మోత్కూరు, ఆలేరు కైవసం
  • - ఎక్స్‌అఫీషియో ఓట్లతో భువనగిరి, యాదగిరిగుట్టలో విజయం
  • - గుట్టలో కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఎత్తులకు చెక్‌ పెట్టిన ‘గొంగిడి’ దంపతులు
  • - భువనగిరిలో పైళ్ల శేఖర్‌రెడ్డి ఎత్తులకు కాంగ్రెస్‌ చిత్తు
  • - చౌటుప్పల్‌లో టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చిన సీపీఎంకు వైస్‌ చైర్మన్‌ పదవి

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ: మున్సిపాలిటీల్లో కారు సృష్టించిన సునామీకి ప్రతిపక్ష పార్టీలు కొట్టుకుపోయాయి. సోమవారం పురపాలికల చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికల్లో కారు క్లీన్‌స్వీప్‌ చేసింది. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ జెండా ఎగిరింది.  స్పష్టమైన మెజార్టీ సాధించిన భూదాన్‌పోచంపల్లి, మోత్కూరు, ఆలేరుతో పాటు సీపీఎం మద్దతుతో చౌటుప్పల్‌ మున్సిపాలిటీ పీఠాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకున్నది. ఎక్స్‌అఫీషియో ఓట్లతో భువనగిరి,  యాదగిరిగుట్ట పురపాలికలను గులాబీపార్టీ దక్కించుకున్నది. 


పురపాలికల చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికల్లో కారు క్లీన్‌స్వీప్‌ చేసింది. మున్సిపాలిటీల్లో కారు సృష్టించిన సునామీకి ప్రతిపక్ష పార్టీలు కొట్టుకుపోయాయి. ఈ నెల 22న జరిగిన పోలింగ్‌లో జిల్లాలోని పట్నం ఓటర్లు ఇచ్చిన అమూల్యమై న తీర్పులో అభివృద్ధికి పట్టం కట్టారు. సోమవారం జరిగిన చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక విషయంలో ఎక్కడా ఎలాంటి తప్పు జరుగకుండా చూసుకున్న టీఆర్‌ఎస్‌ నా యకులు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ చేసిన సూచనలతో అన్ని పురపాలికలపై  గులాబీజెం డా రెపరెపలాడే విధంగా చర్యలు తీసుకున్నారు. ఆరు ము న్సిపాలిటీల్లో నాలుగింటిలో టీఆర్‌ఎస్‌ అత్యధిక మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్నది. యాదగిరిగుట్టలో మంత్రి కేటీఆర్‌ చతురతతో ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గొంగి డి సునీతామహేందర్‌రెడ్డి కోరిక మేరకు ముగ్గురు ఎక్స్‌అఫిషియో సభ్యులను కేటాయించి యాదగిరిగుట్ట పురపాలికపై గులాబీజెండా ఎగురవేసే విధంగా చేయగలిగారు. ఎవ రూ ఊహించని విధంగా సాధారణ మధ్య తరగతి వర్గానికి చెందిన పాత్రికేయ వృత్తిలోని ఎరుకల హేమేందర్‌ సతీమణి సుధ గుట్ట తొలి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నిక కావడం ద్వారా గుట్ట పట్టణంలోని అతిపెద్ద సామాజిక వర్గమైన గౌడ కులానికి ఏ పార్టీ ఇవ్వని అసాధారణ ప్రాతినిధ్యం ఇచ్చినట్లు అయింది. వైస్‌ చైర్మన్‌గా కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన కాటం రాజు ఎన్నికయ్యారు. 


భువనగిరిలో ఎమ్మెల్యే పైళ్ల ఎత్తులకు కాంగ్రెస్‌ చిత్తు ..

జిల్లాలోని అతి పెద్ద మున్సిపాలిటీ అయిన భువనగిరిలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ప్రదర్శించిన రాజకీయ ఎత్తుగడలు కాంగ్రెస్‌ పార్టీ కోలుకోలేని విధంగా దెబ్బతిన్నది. దేశమంతటా బీజేపీ, కాంగ్రెస్‌ పరస్పర విరుద్ధ భావజాలంతో పూర్తి వ్యతిరేకతతో వాటి స్టాండ్‌ ఉండగా భువనగిరిలో కాంగ్రెస్‌, బీజేపీ కలిసి టీఆర్‌ఎస్‌పై కత్తి కట్టాయి. ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డిని గడ్డికరిపించాలని చూసిన  కాంగ్రెస్‌, బీజేపీలకు పైళ్ల వేసిన ఎత్తుగడలతో జాతీయ పార్టీకి చెందిన నేతలు చిత్తయ్యారు. సాధారణ పేద బలహీన వర్గానికి చెందిన ఎనబోయిన ఆంజనేయులును భువనగిరి చైర్మన్‌గా ఎన్నికయ్యేలా చేయడం ద్వారా శేఖర్‌రెడ్డి తన రాజకీయ చతురతను ప్రదర్శించారు. అదేవిధంగా రాయిగిరి ఎస్సీ మాది గ కులానికి చెందిన చింతల కిష్టయ్యను వైస్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యేలా చేశారు.  చౌటుప్పల్‌లో కూడా సీనియర్‌ పాత్రికేయుడు వెన్‌రెడ్డి రాజు బలహీనవర్గాలకు చెందిన వ్యక్తి. సౌమ్యునిగా పేరున్న రాజు ఎన్నికవుతున్నాడని తెలి సి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తట్టుకోలేకపోయాడు. ఎన్నిక  జరుగకుండా అడ్డుకున్న తీరు స్పష్టం చేసింది. రాజజ్‌గోపాల్‌రెడ్డి చేసిన హంగామాను తిప్పికొట్టిన అధికారులు గంట ఆలస్యంగానైనా ఎన్నికను  సమర్థవంతంగా నిర్వహించిన తీరు ప్రశంసనీయమైనది. చౌటుప్పల్‌లో వైస్‌ చైర్మన్‌గా సీపీఎంకు చెందిన బత్తుల శ్రీశైలం ఎన్నికయ్యారు. ఆలేరులో కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వస్పరి శంకరయ్య చైర్మన్‌గా, వైస్‌ చైర్‌పర్సన్‌గా మొరిగాడి మాధవి ఎన్నికయ్యారు.  ఆలేరు మార్కె ట్‌ కమిటీ చైర్మన్‌ పడాల శ్రీనివాస్‌ గొంగిడి దంపతుల సహాయంతో ఆలేరు పురపోరు ఇన్‌చార్జీగా వ్యవహరించడంతో టీఆర్‌ఎస్‌కు భారీ మెజార్టీ వచ్చింది. మోత్కూరు  మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా సావిత్ర మేఘారెడ్డి, వైస్‌ చైర్మన్‌గా బొల్లేపల్లి వెంకటయ్య ఎన్నికయ్యారు. పోచపంల్లిలో కూడా టీఆర్‌ఎస్‌కు అత్యధిక సీట్లు  వచ్చాయి. చైర్‌పర్సన్‌గా  బత్తుల విజయలక్ష్మి, వైస్‌ చైర్మన్‌గా బతుక లింగస్వా మి  ఎన్నికయ్యారు. 


బడుగులకు అక్కున చేర్చుకున్న టీఆర్‌ఎస్‌...

పురపోరులో అత్యధిక చైర్మన్‌ పదవులు బీసీలకు రిజర్వు అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఫలితం గా ఆరు పురపాలికల్లో ఐదింటిలో బీసీలు పదవులను కైస వం చేసుకున్నారు. బీసీ  మహిళలు అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నారు. గుట్టలో ఎరుకల సుధ, పోచపంల్లిలో చిట్టిప్రోలు విజయలక్ష్మి బీసీ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లయింది.ఆలేరు బీసీ జనరల్‌ కావడంతో వస్పరి శంకరయ్య చైర్మన్‌గా ఎన్నికయ్యారు. భువనగిరిలో కూడా బీసీ అయిన ఎనబోయిన ఆంజనేయులు అవకాశాన్ని దక్కించుకున్నారు.  మోత్కూరులో సావిత్ర మేఘారెడ్డి తొలి మహిళా చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.

   

కారు జోరుకు విపక్షాలు భేజారు...

ఆరు మున్సిపాలిటీలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుని కారుకు ఎదురేలేదని మరోసారి నిరూపించారు. టీఆర్‌ఎస్‌ ప్రభంజనం ముందు ప్రతిపక్ష పార్టీలు విలవిలలాడాయి. యాదగిరిగుట్టలో నాలుగు స్థానాలు గెలుపొందిన కాంగ్రెస్‌ టీఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్థులను ప్రలోభాలకు గురి చేసి గుట్ట పీఠంపై కాంగ్రెస్‌ జెండా ఎగురవేయాలని చేసిన ప్రయత్నాలను ప్రభుత్వ విప్‌ గొంగిడి  సునీతామహేందర్‌రెడ్డి సమర్థవంతంగా తిప్పికొట్టారు. మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి గుట్ట పురపీఠం కారుఖాతాలో పడేలా చేయగలిగారు. 


సంక్షేమ పథకాలే అండగా.... 

ఎన్నికల ఏదైనా గెలుపు టీఆర్‌ఎస్‌ వైపు ఉంటూవస్తున్నది. వరుస విజయాలతో గులాబీ పార్టీ దూసుకెళ్తున్నది. 2014 పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికల నుంచి తాజాగా 2018  రెండో అసెంబ్లీ, గ్రామ పంచాయతీ, జడ్పీలు, ఎంపీపీలను  ఖాతాలో వేసుకున్న టీఆర్‌ఎస్‌ పార్టీ, తాజాగా మున్సిపాలిటీలపై సైతం గులాబీ జెండాను ఎగురవేసింది. యాదగిరిగుట్ట, ఆలేరులో  ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, భువనగిరి, భూదాన్‌పోచంపల్లిలో ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, మోత్కూరులో ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌, చౌటుప్పల్‌ మున్సిపాలిటీలో మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ వ్యూహాలకు పదును పెట్టి టీఆర్‌ఎస్‌ గెలుపునకు మార్గం సుగమం చేశారు. ప్రధానంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలే హస్త్రంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రచారం చేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, ఆసరా పెన్షన్లు, ఇంటింటికీ ఉచిత నల్లా, రైతు బంధు, రైతు బీమా పథకాలతో పాటు భారీ నీటి ప్రాజెక్టుల నిర్మాణం వంటి అభివృద్ధి పథకాలు ఓటర్లకు వివరించి, ఓటు బ్యాం కును టీఆర్‌ఎస్‌ ఖాతాలో వేసేలా చేశారు. సొంత నియోజకవర్గాల్లో సైతం గెలిపించుకోలేని పరిస్థితిలో కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు  ఉన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన  నియోజకవర్గంలోని చౌటుప్పల్‌ మున్సిపాలిటీలో కనీసం చైర్మన్‌ పదవిని దక్కించుకోలేకపోయారు. 


టీఆర్‌ఎస్‌ పట్ల ఆదరణతోనే చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికల్లో విజయం... 

అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పునరావృతమయ్యాయి.జిల్లాలో ఆలేరు మున్సిపాలిటీల్లో 12 వార్డులకు  8 టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోగా ఒకటి కాంగ్రెస్‌, ఒకటి బీజేపీ, 2 ఇండిపెండెంట్‌ అభ్యర్థు లు తమ ఖాతాలో వేసుకున్నారు. భువనగిరిలో 35 వార్డు ల్లో 15 టీఆర్‌ఎస్‌కు వచ్చాయి. పోలింగ్‌ ముగిసిన వెంటనే ఇద్దరు స్వతంత్రులు టీఆర్‌ఎస్‌లో చేరడంతో 17కు చేరిన బలానికి తోడు  ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఓట్ల వల్ల చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులు టీఆర్‌ఎస్‌కు దక్కే విధంగా చేయగలిగారు.  11 కాం గ్రెస్‌, 7 బీజేపీ పార్టీలు గెలుపొందగా బీజేపీకి చెందిన 22 వార్డు సభ్యుడు  బొర్ర రాకేశ్‌కు అనారోగ్యంతో ఓటింగ్‌ ప్ర క్రియకు హాజరుకాలేకపోయారు. భూదాన్‌పోచంపల్లిలో 13 వార్డులకు  ఒకటి టీఆర్‌ఎస్‌ ఏకగ్రీవం కాగా, 8 టీఆర్‌ఎస్‌, 2 కాంగ్రెస్‌, ఒకటి టీఆర్‌ఎస్‌ రెబల్‌, చౌటుప్పల్‌లో 8 టీఆర్‌ఎస్‌, 5 కాంగ్రెస్‌, 3 సీపీఎం, 3 బీజేపీ, ఒకరు ఇం డిపెండెంట్‌ అభ్యర్థులు గెలుపొందారు. మోత్కూరులో 7 టీఆర్‌ఎస్‌, 5 కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలుపొందారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో  5టీఆర్‌ఎస్‌, 4కాంగ్రెస్‌, 1 సీపీ ఐ, 2 ఇండిపెండెంట్‌ అభ్యర్థులు గెలుపొందారు. గుట్టలో ఎక్స్‌అఫిషియో సభ్యుల సహకారంతో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులు టీఆర్‌ఎస్‌ ఖాతాలో పడ్డాయి.

 

గుట్ట, చౌటుప్పల్‌లో కోమటిరెడ్డి బ్రదర్స్‌ హంగామా.. 

యాదగిరిగుట్ట, చౌటుప్పల్‌లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను దొంగదారిన విజయతీరాలకు చేర్చాలని భావించిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హల్‌చల్‌ చేశారు. ఎన్నికలను ఎలాగైనా వాయిదా వేయించాలన్న తలంపుతో చౌటుప్పల్‌లో సీపీఎంకు చెందిన గోపగోని లక్ష్మణ్‌, బత్తుల శ్రీశైలం, దండ హిమబిందులను మీరు మోసం చేశారు... మిమ్మల్ని చంపేస్తా అంటూ వారిని బెదిరించారు. అధికారుల ముందే ఎమ్మెల్యే చిందులేయడంతో అక్కడున్నవారంతా వణికిపోయారు. ఎన్నికల అధికారి సూరజ్‌కుమార్‌ను ఎన్నిక ఎలా నిర్వహిస్తావంటూ వాగ్వా దం చేశారు.. ఎన్నికల అధీకృతాధికారి  చౌటుప్పల్‌ ఆర్‌డీవో ఎస్‌. సూరజ్‌కుమార్‌ మైకును గుంజి కిందపడేశారు. దాంతో ఎన్నిక గంట ఆలస్యంగా జరిగింది. అంతేకాకుండా సీపీఎంకు చెందిన కౌన్సిలర్‌ ఇంటిపై దాడి చేయించారు. యాదగిరిగుట్టలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నడిరోడ్డుపై నానా హంగామా చేశారు. ఇక్కడ ఓటు వేయటానికి నమోదు చేసుకోని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గుట్ట పట్టణ సీఐ పాండురంగారెడ్డిపాటు గొంగిడి దంపతులపై వ్యక్తిగత దూషణలు చేశారు. దీనిపై టీఆర్‌ఎస్‌ శ్రేణులు కూడా ఘాటుగానే స్పందించాయి. 

VIDEOS

logo