ఎమ్మెల్యే కోమటిరెడ్డిది హేయమైన చర్య

చౌటుప్పల్, నమస్తేతెలంగాణ: విచక్షణ కోల్పోయి ప్రమాణ స్వీకారానికి వచ్చిన మహిళా కౌన్సిలర్లపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వీధిరౌడీలా వ్యవహరిస్తూ దాడులకు దిగడం హేయమైన చర్య అని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. సోమమారం చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రజాస్వామ్యానికి, ఎమ్మెల్యే పదవికి మచ్చ తెచ్చేలా రాజగోపాల్‌రెడ్డి వ్యవహరించారని మండిపడ్డారు. తీవ్ర పదజాలంతో దూషిస్తూ దాడికి దిగినా టీఆర్ఎస్, సీపీఎం కౌన్సిలర్లు సంయమనంగా వ్యవహరించడం అభినందనీయమన్నారు. తమ మంచితనాన్ని చేతకాని తనంగా తీసుకోవద్దన్నారు. రాజకీయ వ్యభిచారం చేస్తున్న ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డికి సరైన సమయంలో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ మహిళా కౌన్సిలర్లపై దాడికి పాల్పడిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన తప్పును బహిరంగంగా ఒప్పుకొని యావత్ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో తన ఓటమిని గ్రహించిన ఎమ్మెల్యే ఈ సమావేశాన్ని ఎలాగైనా వాయిదా వేయించాలనే దాడులకు దిగారన్నారు. ప్రజాతీర్పును గౌరవించడం తెలియని ఆయన ఎమ్మెల్యే పదవికి మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన బత్తుల శ్రీశైలం ప్రమాణస్వీకారం చేస్తుండగా దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యేపై యావత్ బీసీలంతా ఆగ్రహంగా ఉన్నా రని అన్నారు. సీపీఎం కార్యాలయంతో పాటు ఆ పార్టీ కౌన్సిలర్ల ఇండ్లపై దాడికి దిగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.గూండాగిరికి పాల్పడుతు న్న ఎమ్మెల్యేకు ప్రజలే తగిన బుద్ధి చెబుతార న్నారు. వారి వెంట ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు, మాజీ జడ్పీటీసీ పెద్దిటి బుచ్చిరెడ్డి, ఊడుగు శ్రీనివాస్‌గౌడ్, నాయకులు ఎండీ బాబా షరీఫ్, బొడిగె బాలకృష్ణ, కొత్త పర్వతాలు యాదవ్ ఉన్నారు.
తాజావార్తలు
- రసవత్తరంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికలు
- ఐపీఎల్ షెడ్యూల్ విడుదల.. ఏప్రిల్ 9న తొలి మ్యాచ్
- ఐటీ సోదాలు.. బయటపడిన వెయ్యి కోట్ల అక్రమాస్తులు!
- సోనియా అధ్యక్షతన కాంగ్రెస్ స్ట్రాటజీ గ్రూప్ సమావేశం
- వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించండి : మంత్రి కేటీఆర్
- తమిళనాడు, కేరళలో అమిత్‌షా పర్యటన
- కాసేపట్లో మోదీ ర్యాలీ.. స్టేజ్‌పై మిథున్ చక్రవర్తి
- న్యూయార్క్‌లో రెస్టారెంట్ ప్రారంభించిన ప్రియాంక చోప్రా
- ఆరు రాష్ట్రాల్లోనే 84.71 శాతం కొత్త కేసులు: కేంద్రం
- ఫాస్టాగ్ కొంటున్నారా.. నకిలీలు ఉన్నాయి జాగ్రత్త!