మంగళవారం 14 జూలై 2020
Yadadri - Jan 27, 2020 , 05:46:09

ఘనంగా 71వ గణతంత్ర దినోత్సవం

ఘనంగా 71వ గణతంత్ర దినోత్సవం

చౌటుప్పల్‌, నమస్తేతెలంగాణ : మున్సిపాలిటీ పరిధిలోని గణతంత్ర దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాల ఎదటు బాధ్యులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆర్డీవో ఎస్‌.సూరజ్‌కుమార్‌, ఏసీపీ కార్యాలయం ఎదుట ఏసీపీ సత్తయ్య, పోలీస్‌స్టేషన్‌ కార్యాలయంలో సీఐ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదుట సీఐ మునిలు జాతీయ జెండాను ఆవిష్కరించారు. 


మోత్కూరులో...

   మోత్కూరు : పేదరిక నిర్మూళన, అవినీతి రహిత సమా జం, అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే సీఎం కేసీఆర్‌ ప్రభు త్వ లక్ష్యమని రాష్ట్ర ఆయిల్‌ ఫెడ్‌ చైర్మన్‌ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. 71వ గణతంత్ర దినోత్సవాన్ని  మండలంలో పండుగ వాతావరణంలో ప్రజలు ఆదివారం ఘనంగా జరుపుకున్నారు.తహసీల్దార్‌ ఆహ్మద్‌, ఎంపీడీవో పొరెడ్డి మనోహర్‌రెడ్డి, ఎస్‌ఐ సీహెచ్‌ హరిప్రసాద్‌,  ఎక్సైజ్‌  సీఐ సిహెచ్‌ చంద్రశేఖర్‌, సీడీపీవో యాదలక్ష్మి,  టీఆర్‌ఎస్‌  మండలాధ్యక్షుడు  పొన్నెబోయిన రమేశ్‌,  ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ రాంపాక అవిలయ్య, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు అండెం వెంకట్‌రెడ్డి, శాఖ గ్రంథాలయం చైర్మన్‌ కోమటీ మత్స్యగిరి, భారత్‌ గ్యాస్‌ మేనేజర్‌  ఆంజనేయులు, పీహెచ్‌సీ వద్ద డాక్టర్‌ కిశోర్‌, సాయి చైతన్య పాఠశాల్లో కరస్పాండెంట్‌   రవీందర్‌రెడ్డి తదితరులు తమ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో  ఎంపీపీ దీటి సంధ్యారాణి సందీప్‌,వైస్‌ ఎంపీపీ బుషిపాక లక్ష్మి,ఏకె స్వప్న , టీఆర్‌ఎస్‌ నాయకులు కల్వల ప్రకాశ్‌రాయుడు, మున్సిపల్‌ కౌన్సిలర్‌ డాక్టర్‌ గుర్రం కవిత లక్ష్మీనర్సింహారెడ్డి,  ఆయా పార్టీల ప్రతినిధులు టి. సోమిరెడ్డి, గౌరు శ్రీనువాస్‌, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.


 మండలంలో..

 మండలంలోని  పాటిమట్ల, సదర్శాపురం, దాచారం, పొడిచేడు,అనాజిపురం, దత్తప్పగూడెం, పాలడుగు, పనకబండ, రాగిబావి, ముశిపట్లతో పాటు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప, బుజిలాపురం గ్రామాల్లో  వేడుకలను ఘనం గా నిర్వహించారు. ఆయా పంచాయతీల్లో పంచాయతీ కా ర్యాదర్శులు  జెండాను ఆవిష్కరించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో,అక్షర, సాయి చైతన్య, సెయింట్‌ ఆన్స్‌, సెక్రేడ్‌ హార్ట ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల్లో ప్రధానోపాధ్యాయులు అండెం వెంకట్‌రెడ్డి, ఎస్‌ఎంసీ చైర్మన్‌ జం గ వెంకట్‌నర్సయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


రామన్నపేటలో..

రామన్నపేట  : మండలకేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో గణతంత్ర దినోత్సవాన్ని జాతీయ జెండాను ఎగురవేసి ఘనంగా నిర్వహించారు. స్థానిక మున్సిఫ్‌మెజిస్ట్రేట్‌ కోర్టు లో జడ్జి ప్రమీలజైన్‌, తహసీల్దార్‌ శ్రీనివాసకుమార్‌,ఎంపీడీవో జలేంధర్‌రెడ్డి, సర్పంచ్‌ గోదాసు శిరిషాపృథ్వీరాజ్‌, దవాఖాన సూపరింటెండెంట్‌ విజయలక్ష్మి,ట్రాన్స్‌కో ఏడీఈ పద్మ,ఆర్‌అండ్‌ బీ ఏడీఈ షహనాజ్‌బేగం,సీఐ ఎవీరంగా, ఏఎస్‌డబ్ల్యూవో కె.జనార్దన్‌రెడ్డి,ఎస్‌ఐ సాయిలు, మార్కెట్‌ సెక్రటరీ కె.చంద్రశేఖర్‌, సింగల్‌విండో సీఈవో జంగారెడ్డి, ఎస్టీవో గంగుల పురుషోత్తంరెడ్డి, సీడీపీవో శైలజ, డిగ్రీ, జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాల్‌లు బెల్లి యాదయ్య, సం జీవ, ఎపీవో వెంకన్న, ఏపీఎం అంజయ్యలు, వివిధగ్రామా ల్లో సర్పంచ్‌లు,పంచాయతీ కార్యదర్శులు ప్రాధానోపాధ్యాయులు జాతీయ జెండాను ఎగురవేశారు.హరిజనవాడ పా ఠశాలలో నిర్వహించిన క్రీడాపోటీల్లో గెలుపొందిన విద్యార్థ్దులకు ఎంపీటీసీ రేహన్‌ బహుమతులను అందజేశా రు. స్థానిక అంబేడ్కర్‌ విగ్రహానికి ఎంపీపీ కన్నెబోయిన జ్యోతిబలరాం,జడ్పీటీసీ పున్న లక్ష్మీజగన్‌ మోహన్‌, వైస్‌ఎంపీపీ నాగటి ఉపేందర్‌లు పూలమాలలు వేసి నివాళులర్పించారు.కార్యక్రమంలో  వివిధ గ్రామాల సర్పంచ్‌లు ఎంపీటీసీలు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.


సంస్థాన్‌నారాయణపురంలో..

  సంస్థాన్‌నారాయణపురం :   మండల పరిషత్‌ కార్యాయలంలో ఎంపీడీవో జలంధర్‌రెడ్డి, తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ దయాకర్‌రెడ్డి, మండల వనరుల కార్యాలయ మండల విద్యాధికారి గుర్రం వెంకటేశ్వర్లు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో చైర్మన్‌ గడ్డం మురళీధర్‌రెడ్డి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్‌ దీప్తి, రక్షక భటనిలయంలో ఎస్సై నాగరాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. బాలుర ఉన్నత పాఠశాలలో క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు సర్పంచ్‌ సికిలమెట్ల శ్రీహరి, ఎంపీటీసీ బచ్చనగోని గాలయ్యలు బహుమతులను అందజేశారు. అనంతరం పాఠశాలకు మంజూరైన సైన్సు ల్యాబ్‌ నిర్మాణానికి ఎంఈవోతో కలిసి భూమిపూజ చేశారు. గ్రామంలోని ఫలక్‌నుమాగుట్టపై ఫొటోగ్రాఫర్లు జాతీయజెండాను ఆవిష్కరించారు. గుజ్జ గ్రామంలోని పాఠశాలకు మండల కేం ద్రానికి చెందిన సతీశ్‌కుమార రెండు కంప్యూటర్లను బహూకరించారు. వెంకంబావితండాలో ముగ్గుల పోటీల విజే తలకు సర్పంచ్‌ పాండురంగానాయక్‌ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ గుత్త ఉమాప్రేమ్‌చందర్‌రెడ్డి, జడ్పీటీసీ వీరమల్ల భానువెంకటేశంగౌడ్‌, వైస్‌ఎంపీపీ ఆం గోతు రాజు, ఉప సర్పంచులు పాల్గొన్నారు.


చౌటుప్పల్‌ రూరల్‌లో..

 చౌటుప్పల్‌ రూరల్‌ : మండలవ్యాప్తంగా  గణతంత్ర దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. మండలకేంద్రంలో  తహసీల్దార్‌  కార్యాలయంలో  తహసీల్దార్‌  కె. గిరిధర్‌ జాతీయజెండాను ఆవిష్కరించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో రాకేశ్‌రావు జెండాను ఎగురవేశారు. నేలపట్ల ప్రాథమిక పాఠశాలలో, గుండ్లబావిలోని గ్రీన్‌గ్రోవ్‌ పాఠశాలల్లో కూడా ఈ వేడుకలను చేపట్టారు 


అడ్డగూడూరులో.. 

అడ్డగూడూరు: 71వ ఘనతంత్ర దినోత్సవాన్ని మండలకేంద్రంతోపాటు, పలు గ్రామాల్లో  ఆదివారం ఘనంగా జరుపుకున్నారు.తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ రామకృష్ణ,ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి నరేశ్‌,పోలీస్‌స్టేషన్‌లో ఎస్త్సె ఇద్రీస్‌ ఆలీ,  వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏవో అరుణకుమారి సాంఘిక సంక్షేమ పాఠశాల లో ప్రిన్సిపాల్‌ రూప, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ దర్శనాల అంజయ్య,టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్‌రెడ్డి,పశువైద్యశాల కార్యాలయంలో పశువైద్యాధికారి అశోక్‌కుమార్‌ జాతీయ జెండాను ఎగురవేశారు. 


logo