ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన

- ఆకట్టుకున్న శకటాలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతుల ప్రదానం
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలోని భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆదివారం నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో శకటాల ప్రదర్శన ఆకట్టుకున్నది. ఇందులో యాదగిరిగుట్ట దేవాలయం శకటం, అటవీశాఖ, రైతుమిత్ర మొబైల్ యాప్, గ్రామీణాభివృద్ధిశాఖ, వైద్య, ఆరోగ్యశాఖ, 108, 104, రహదారులు, భవనములు, పశువైద్య, పశుసంవర్ధకశాఖ, అగ్నిమాపక, నీటిపారుదల ఆయకట్టు, విద్యాశాఖ ఆధ్వర్యంలో శకటాల ప్రదర్శన నిర్వహించారు. ఇందులో విద్యాశాఖ శకటం ప్రథమ బహుమతి, పశుసంవర్ధకశాఖ ద్వితీయ బహుమతి, గ్రామీణాభివృద్ధిశాఖకు తృతీయ బహుమతులను ఆయా శాఖల అధికారులు అందుకున్నారు. ఆయాశాఖల అధికారులను కలెక్టర్ అనితారామచంద్రన్, జిల్లా అధికారులు అభినందించారు.
అకట్టుకున్న స్టాల్స్ ప్రదర్శన..
జిల్లాలోని భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఆయాశాఖల ఆధ్వర్యంలో స్టాల్స్ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇందులో విద్యాశాఖ, మత్స్యశాఖ, మిషన్‌భగీరథ, ఉద్యానవనశాఖ, వ్యవసాయశాఖ, పట్టు పరిశ్రమ, గ్రామీణాభివృద్ధి, చేనేత, జౌళి, షెడ్యూల్ కులములశాఖ, విద్యాశాఖ, పరిశ్రమలశాఖ ఆధ్వర్యంలో స్టాల్స్ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్‌లో వ్యవసాయశాఖకు ప్రథమ బహుమతి, ఉద్యానవనశాఖకు ద్వితీయ బహుమతి, మిషన్ భగీరథకు తృతీయ బహుమతి వచ్చింది. అంతకు ముందు స్టాల్స్‌ను కలెక్టర్ అనితారామచంద్రన్, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆయిల్‌ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, జాయింట్ కలెక్టర్ రమేశ్, డీఆర్వో వెంకట్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీ మందడి ఉపేందర్‌రెడ్డి, ఆర్డీవో భూపాల్‌రెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియ, డీఈవో చైతన్యజైని, ఏసీపీ భుజంగరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కొలను లావణ్యదేవేందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ఎడ్ల సత్తిరెడ్డి, జడ్పీటీసీ సుబ్బూరు బీరు మల్లయ్య, రాజాపేట జడ్పీటీసీ శామకూర గోపాల్‌గౌడ్ పాల్గొన్నారు.