బుధవారం 03 మార్చి 2021
Yadadri - Jan 27, 2020 , 05:35:51

పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం

పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం

భూదాన్‌పోచంపల్లి : గ్రామాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల పరిధిలోని శివారెడ్డిగూడెంలో ఆదివారం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామస్తులకు చెత్త సేకరణ బుట్టలు, జూట్‌ బ్యాగులను అందజేశారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ నూతన ట్రాక్టర్‌ను జడ్పీటీసీ కోట పుష్పలతతో కలిసి ప్రారంభించారు. నూతనంగా నిర్మించనున్న శ్మశాన వాటిక పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం హైదరాబాద్‌ సన్‌ రైజ్‌ దవాఖాన సౌజన్యంతో ఎన్‌ఆర్‌ఐ మేకల ప్రబోద్‌రెడ్డి, జంగారెడ్డిల సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని వారు ప్రారంభించారు. 

VIDEOS

logo