బుధవారం 03 మార్చి 2021
Yadadri - Jan 24, 2020 , 23:34:17

బాలికలు ఉత్తమ ఫలితాలు సాధించాలి

బాలికలు  ఉత్తమ ఫలితాలు సాధించాలి
  • - కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ ,డీఈవో చైతన్యజైనిబొమ్మలరామారం : బాలికల సంరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని యాదాద్రిభువనగిరి కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని మల్యాల గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో నిర్వహించిన జాతీయ బాలికల దినోత్సవ కార్యక్రమాన్ని హాజరై మాట్లాడారు. బాలికలు మనోధైర్యంతో పాటు కరాటే వంటి ఆత్మరక్షణ శిక్షణ నేర్చుకోవాలన్నారు. సీఎం కేసీఆర్‌ చేపట్టే ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని అన్ని రంగాల్లో రాణించాలన్నారు. నేడు సమాజంలో బాలికలపై జరుగుతున్న దాడుల నివారణకు ప్రతి ఒక్కరూ కరాటే, మార్షల్‌ ఆర్ట్స్‌పై బాలికలు పట్టు సాధించాలన్నారు. సమస్యలను ఎదుర్కొనేందుకు ధైర్యంగా నిలబడాలన్నారు. ఆత్మవిశ్వాసంతో చదువుల్లో ప్రతిభను చాటేందుకు బాలికలు పోటీపడాలన్నారు. పట్టుదలతో చదివి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధించాలన్నారు. కార్యక్రమంలో డీఈవో చైతన్యజైని, మండల ప్రత్యేకాధికారి జ్యోతికుమార్‌, తహసీల్దార్‌ పద్మసుందరి, ఇన్‌చార్జి ఎంపీడీవో శేషాద్రి, జడ్పీహెచ్‌ఎస్‌ హెచ్‌ఎం ఉపేంద్ర, కెజిబివి ప్రిన్సిపాల్‌ మాధవి, సర్పంచ్‌ శ్రీను , ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు ఉన్నారు.


VIDEOS

logo