మంగళవారం 09 మార్చి 2021
Yadadri - Jan 22, 2020 , 00:26:21

ఆంజనేయస్వామికి పూజలు

ఆంజనేయస్వామికి పూజలు


యాదగిరిగుట్ట, నమస్తే తెలంగాణ : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో మంగళవారం క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామిని ఆరాధిస్తూ ఆకుపూజ చేపట్టారు. ఈ క్షేత్రానికి పాలకుడిగా చెంత గల గుడిలో హనుమంతుడిని సింధూరంతో అలంకరించి అభిషేకించారు. తమలపాకులతో అర్చన చేపట్టారు. వేదమంత్రాల మధ్య జరిగిన పూజ ల్లో పలువురు భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. తమలపాకులతో అర్చన చేశారు. లలితాపారాయణం చేశారు. ఆంజనేయస్వామికి ఇష్టమైన వడపప్పు. బెల్లం, అరటి పండ్లను నైవేధ్యంగా సమర్పించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. నిత్యపూజలు ఉదయం 4గం టల నుంచి ప్రారంభమయ్యాయి.

సుప్రభాత సేవ మొదలుకుని నిజాభిషేకం వరకు కోలాహలంగా పూజలు కొనసాగాయి. శ్రీవారి నిత్య కల్యా ణం నిర్వహించారు. నిత్యపూజల్లో భాగంగా బాలాలయ మండపంలో శ్రీలక్ష్మీనరసింహుల నిత్యకల్యాణం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. తొలుత శ్రీసుదర్శన నారసింహహోమం నిర్వహించారు. మహా మండపంలో అష్టోత్తరం నిర్వహించారు. సాయంత్రం వేళ అలంకార సేవోత్సవాన్ని సంప్రదాయంగా నిర్వహించారు. అలంకార సేవోత్సవంలో పాల్గొన్న భక్తులకు శ్రీస్వామి అమ్మవారుల ఆశీస్సులు అందజేశారు.

  రూ.1,04,21,346 యాదాద్రీశుడి హుండీల ఆదాయం

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి 29రోజుల హుం డీల ఆదాయం రూ.1,04,21,346  ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో ఎన్.గీత తెలిపారు. మంగళవారం యాదాద్రి కొండపై గల హరిత హోటల్ హుండీలను లెక్కించామని, ఇందులో నగదు రూ.1,04,21,346 ఆ దాయం వచ్చిందని చెప్పారు. మిశ్రమ బంగారం 49 గ్రా ములు, వెండి కిలో 900 గ్రాములు వచ్చిందని తెలిపారు

VIDEOS

logo