ప్రచారానికి తెర

యాదాద్రిభువనగిరిజిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: మున్సిపాలిటీల్లో పచారపర్వం ముగిసింది. సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రచార గడువు ముగియడంతో మైకులు మూగబోయాయి. రోడ్‌షోలు నిలిచిపోయాయి. ఇంటింటి ప్రచారానికి తెరపడింది.ఓటర్లను ప్రభావితం చేసేందుకు అభ్యర్థులు ప్రలోభాల పర్వానికి తెర తీశారు. ఓట్లు పొందేందుకు తమదైన మార్గంలో ప్రయత్నాలు తీవ్రం చేశారు. నగదు, మద్యం పంపిణీ మొదలు పెట్టారు. ఆలేరు, యాదగిరిగుట్టలో పలు పార్టీలకు చెందిన మద్యం తరలిస్తున్న ఆటోలను పోలీసులు సీజ్ చేశారు. పలు ప్రాంతాల్లో స్వతంత్రులు కూడా ఇదే పని చేస్తున్నారు. అయితే మద్యం, నగదు పంపిణీ విషయంలో అభ్యర్థులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బాగా నమ్మకస్తులైన వ్యక్తులకే పంపిణీ బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఆయా మండలాలకు బృందాలను ఏర్పాటు చేశారు. వీరిపై పర్యవేక్షణకు సొంత మనుషులను నియమించుకున్నారు.
నగదు ఓటర్లకు చేరిందా లేదా అని కూడా తెలుసుకుంటున్నారు. ప్రలోభాల నియంత్రణకు అన్ని ఎన్నికల్లోనూ కీలకంగా పనిచేసిన పోలీసులు... ఈ సారి కూడా గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఎన్నికల నియమావళి, ప్రలోభాలను అడ్డుకునే విషయంలో పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. ఈసారి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగురవేయాలని ఎమ్మెల్యేలు జాగ్రత్తలు పడుతున్నారు. సోమవారం భువనగిరి, భూదాన్‌పోచంపల్లిలో శాసనమండలి విప్ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ప్రచారం నిర్వహించగా, ఆలేరు నియోజకవర్గంలోని యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, మోత్కూరులో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ రోడ్‌షో నిర్వహించారు. చౌటుప్పల్‌లో మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఆలేరు మున్సిపాలిటీలో టీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు.
ప్రచారంలో దూసుకెళ్లిన గులాబీ దళం..
అభ్యర్థులను ప్రకటించిన నాటి నుంచి గులాబీ పార్టీ శ్రేణులు ప్రచారంలో దూసుకెళ్లారు. భువనగిరి మున్సిపాలిటీతో పాటు కొత్తగా ఏర్పాటైన ఆలేరు, భూదాన్‌పోచంపల్లి, చౌటుప్పల్, మోత్కూరు, యాదగిరిగుట్ట పరిధిలో చేసిన, చేయబోయే అభివృద్ధిని వివరిస్తూ టీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్లారు. మున్సిపాలిటీలకు ముందు, తర్వాత పరిస్థితులను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. నూతనంగా ఏర్పాటైన మున్సిపాలిటీలపై టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తే పట్టణాభివృద్ధి ఆగకుండా కొనసాగుతుందని ప్రజలకు వివరించారు. అధికార పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రతిపక్షాలు గెలిస్తే జరిగేది శూన్యమని వివరిస్తూ ఓటర్ల వద్దకు వెళ్లారు.
పకడ్బందీగా చర్యలు
పోలీసులు ప్రతి వీధిలో గస్తీ చేస్తూ అనుమానితులను తనిఖీ చేస్తున్నారు. ఆరు మున్సిపాలిటీల పరిధిలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కొనసాగుతున్న నేపథ్యంలో ఎక్కడా డబ్బులు, మద్యం పంపకం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.
వైన్స్‌లకు తాళాలు వేసిన ఎక్సైజ్ పోలీసులు
ఎన్నికలు ముగిసే వరకు వైన్స్‌లు తెరువకూడదని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియ ఆధ్వర్యంలో వైన్స్‌లకు తాళాలు వేశారు. జిల్లాలోని బార్లు, వైన్స్‌ల నుంచి ఎట్టి పరిస్థితుల్లో మద్యం రవాణా కావద్దని ఆమె గట్టి చర్యలు చేపట్టారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు.
పోలింగ్‌కు సర్వం సిద్ధం చేస్తున్న అధికారులు
పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. ఆరు మున్సిపాలిటీల పరిధిలో పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల అధికారులు, కలెక్టర్ అనితారామచంద్రన్, జేసీ రమేశ్, రాచకొండ సీపీ మహేశ్‌భగవత్, డీసీపీ నారాయణరెడ్డి సందర్శించి పలు సూచనలు చేశారు. ఇప్పటికే నియామకమైన పోలింగ్ సిబ్బంది పోలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు చేసే పనుల్లో నిమగ్నమయ్యారు.
తాజావార్తలు
- ఈ నెల 11 నుంచి జూబ్లీహిల్స్ వెంకన్న బ్రహ్మోత్సవాలు
- ఆమె రాజకీయ ఆటలోపడి లక్ష్యాలు మరిచారు: దినేశ్ త్రివేది
- తుపాకీ లైసెన్స్ ఇవ్వండి.. పోలీసులకు హత్రాస్ యువతి విజ్ఞప్తి
- భారీ మెజారిటీతో ‘పల్లా’ను ఎమ్మెల్సీగా గెలిపించాలి : మంత్రి ఎర్రబెల్లి
- కేటీఆర్ పీఏనంటూ మోసాలు.. రంజీ మాజీ క్రికెటర్ అరెస్ట్
- రష్మీ హాట్ అందాలకు యువత దాసోహం
- టెస్ట్ అరంగేట్రానికి 50 ఏండ్లు.. గవాస్కర్‌ను సత్కరించిన బీసీసీఐ
- అతను తెలియక తప్పు చేశాడు: బీహార్ సీఎం
- బీజేపీలోకి నటుడు మిథున్ చక్రవర్తి?
- ఇన్‌కం టాక్స్ దాడులపై స్పందించిన హీరోయిన్ తాప్సీ