గడప గడపకూ గులాబీ దళం

మోత్కూరు : మోత్కూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రచారం హోరెత్తుతోంది.గులాబీ దళం దూకుడు పెంచి ముందుకు కదులుతున్నది. టీఆర్ఎస్ అభ్యర్థులు ప్రతి ఇంటి తలుపు తడుతూ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డిలు టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆదివారం మున్సిపాలిటీ పరిధిలోని కొండగడపలోని జటంగిబావి, జంగాల కాలనీ, కాశవారిగూడెం, కొండాపురం, జామచెట్లబావి, గడిబజార్, వడ్డెర కాలనీ, పద్మశాలి కాలనీ, డ్రైవర్స్ కాలనీల్లో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు.
జోరందుకున్న ప్రచారం..
మున్సిపల్ ఎన్నికల గడువు నేటి సాయంత్రంతో ముగియనుండటంతో మోత్కూరు మున్సిపాలిటీలో టీఆర్ఎస్ ప్రచారం ఊపందుకుంది. ఈ నెల 15 నుంచి ప్రారంభమైన ఎన్నికల ప్రచారం టీఆర్ఎస్ అభ్యర్థులకు ఆయా మున్సిపల్ పుర వీధుల్లో జనం నీరాజనం పలుకుతున్నారు. ఏ వీధిలోకి వెళ్లిన గులాబీలు జెండాలను పట్టుకొని దర్శనమిస్తున్నారు. అభ్యర్థుల వెంట మహిళలు, యువకులు, వృద్ధులు వయో భేదం లేకుండా స్వచ్ఛందంగా తరలివచ్చి ర్యాలీల్లో పాల్గొంటున్నారు. మా సంక్షేమానికి పాటు పడుతున్న సీఎం కేసీఆర్ న్యాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వానికి అండగా ఉంటామని, మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు అం డగా ఉంటామని భరోసా కల్పిస్తున్నారు. అభ్యర్థుల వెంట ఉదయం నుంచి సాయంత్రం వరకు గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ శ్రేణులు ప్రచారం నిర్వహిస్తున్నా రు. టీఆర్ఎస్ దూకుడును చూసిన కాంగ్రెస్, బీజేపీలు బిక్కముఖం వేసుకొని నివ్వే ర పోతున్నాయి. ప్రతిపక్షాలకు ప్రచారస్ర్తాలు లేక ప్రజల్లోకి వెళ్లలేక పోతున్నారు.
అభ్యర్థులకు మద్దతుగా ప్రజా ప్రతినిధులు..
మోత్కూరు మున్సిపాలిటీలోని 12 మున్సిపల్ వార్డులను కైవసం చేసుకొని మున్సిపల్ పై గులాబీ జెండా ను ఎగురేయాలని టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా తుం గతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ కొణతం యాకూబ్‌రెడ్డి, అడ్డగూడూరు జడ్పీటీసీ శ్రీరాము ల జ్యోతి అయోధ్యతో పాటు మోత్కూరు, అడ్డగూడూరు, శాలిగౌరారం మండలాలకు చెందిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ముఖ్యమైన పార్టీ నాయకులు పలు వార్డుల్లో అభ్యర్థుల తరుపున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎమ్మె ల్యే కిశోర్‌కుమార్, ఆయిల్‌ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి ప్రచారం రథం పై ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై పైసా ఖర్చులేకుండా లబ్ధిదారులకు వినియోగం అవుతున్న తీరుపై వివరించారు. రాష్ట్ర మంత్రి జి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే కిశోర్ సహకారంతో నూతనంగా ఏర్పాటైన మోత్కూరు మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం రూ.20కోట్ల నిధులను మం జూరు చేసింది.
పట్టణంలోని ప్రధాన సమస్యల పరిష్కారమైన మురికి కాల్వ లు, సీసీ రోడ్ల నిర్మాణాలకు ప్రొసిండింగ్స్ వచ్చిన విషయాన్ని వివరిస్తూ చైతన్య పరిచి ఓటర్ల ఓట్లను అభ్యర్థిస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థుల విజయంతో మున్సిపాలిటీ మరింతగా అభివృద్ధ్దికి ప్రజలు, ఓటర్లు తమ వంతుగా సహకరించి అభివృద్ధిని ఆశీర్వదించాలని అభ్యర్థులు పురుగుల వెంకన్న, గొడిశాల స్వరూప వెంకన్న, తొంట సుజాత భాస్కర్, మొగుళ్ల అనురాధ శ్రీనివాస్‌రెడ్డి, వనం స్వామి, తీపిరెడ్డి సావిత్రమ్మ మేఘారెడ్డి, బొల్లేపల్లి వెంకటయ్య, దబ్బెటి విజయారమేశ్, పసల విజయా మరియన్నలు ముమ్మర ప్రచారం నిర్వహించారు
తాజావార్తలు
- కరోనా వ్యాక్సినేషన్:మినిట్‌కు 5,900 సిరంజీల తయారీ!
- పాత వెహికల్స్ స్థానే కొత్త కార్లపై 5% రాయితీ: నితిన్ గడ్కరీ
- ముత్తూట్ మృతిపై డౌట్స్.. విషప్రయోగమా/కుట్ర కోణమా?!
- శ్రీశైలం.. మయూర వాహనంపై స్వామి అమ్మవార్లు
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్ విద్యార్థులు దుర్మరణం
- స్విస్ ఓపెన్ 2021: మారిన్ చేతిలో సింధు ఓటమి
- తెలుగు ఇండస్ట్రీలో సుకుమార్ శిష్యుల హవా
- భైంసాలో ఇరువర్గాల ఘర్షణ.. పలువురికి గాయాలు
- గుత్తాకు అస్వస్థత.. మంత్రి, ఎమ్మెల్యేల పరామర్శ
- 2021లో రెండు సినిమాలతో వస్తున్న హీరోలు వీళ్లే