శుక్రవారం 05 జూన్ 2020
Yadadri - Jan 20, 2020 , 02:43:35

ఆశీర్వదించండి..అభివృద్ధి చేసి చూపిస్తాం

ఆశీర్వదించండి..అభివృద్ధి చేసి చూపిస్తాం
  • - మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి
  • - తంగడపల్లిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం
చౌటుప్పల్‌, నమస్తేతెలంగాణ: ప్రజలంతా ఆశీర్వదించి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. తంగడపల్లి గ్రామంలో ఆదివారం 5వ వార్డులోని ముదిరాజులను కలిసి కారుగుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. వార్డులో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. తాను ముదిరాజులకు 53 మోపెడ్‌లు, 3 టాటా ఏసీ వాహనాలను మంజూరు చేయించానని తెలిపారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొయ్యడ ప్రవళికశేఖర్‌గౌడ్‌ను గెలిపిస్తే 5వ వార్డు రూపురేఖలను మారుస్తానని తెలిపారు. అనంతరం  మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని గ్రామాలను ఎంతో అభివృద్ధి చేశామని వివరించారు. ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. తంగడపల్లి గ్రామం టీఆర్‌ఎస్‌కు కంచుకోటగా మారిందని తెలిపారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలిస్తేనే నిధులు పుష్కలంగా విడుదలవుతాయని, అన్ని గ్రామాల రూపురేఖలు మారుతాయని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపిస్తే 5వ వార్డుకు రూ. కోటి నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేయిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సంస్థాన్‌నారాయణపురం జడ్పీటీసీ వీరమళ్ల భానుమతి వెంకటేశంగౌడ్‌, నాయకులు దైదా మోహన్‌రెడ్డి, బొప్పిడి రఘునందన్‌రెడ్డి, కొండూరు వెంకన్నగౌడ్‌, బండి వెంకన్న, గట్టు రామచంద్రం, సొప్పరి అంజయ్య, కందుల సత్తయ్య, కందుల వెంకటయ్య, బొల్లగోని నర్సింహ, కృష్ణ, నూతి యాదయ్య, కందుల వెంకటయ్య, సత్తయ్య, చిత్రాల యాదయ్య, చిత్రాల బుచ్చిరాములు, కందుల పుల్లయ్య, తాల్లగూడెం శ్రీను, బొల్లమోని శ్రీను, చిత్రాల నర్సింహ, వెంకటేశం, నక్క వెంకటేశం, బొల్లమోని వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

6వ వార్డు అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి..

6వ వార్డు అభ్యర్థి ముటుకుల్లోజు దయాకరాచారిని భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. 6వ వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సర్పంచ్‌ దయాకరాచారి పట్టుబట్టి తన నుంచి  భారీగా నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేశారని తెలిపారు. 6వ వార్డుపై పూర్తి అవగాహన ఆయనకే ఉందని తెలిపారు. సమస్యలు ఏంటో, ఎలా పరిష్కరించాలో చక్కగా తెలుసని వివరించారు. ప్రతిపక్షాల అభ్యర్థులకు ఓటు వేస్తే వార్డు అభివృద్ధికి దూరమవుతుందన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఊసేలేదని, కాంగ్రెస్‌ ఎప్పుడో గల్లంతయ్యిందని తెలిపారు. ఆ పార్టీల అభ్యర్థులకు ఓటు వేస్తే ఎలా అభివృద్ధి చేస్తారో ప్రతి ఒక్కరూ విజ్ఞతతో ఆలోచించాలని కోరారు. కారుగుర్తుకు ఓటు వేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో దేశగోని వెంకటేశం, బొంగు స్వామి, బొంగు మహేష్‌గౌడ్‌,  కేతరాజు పకీర్‌, రావుల ముత్యాలు, నాగరాజు, మురళి, సుర్వి అప్పారావు, సుర్వి కిషన్‌, కడాల ముత్యాలు, లింగస్వామి  తదితరులు పాల్గొన్నారు.


logo