గురువారం 22 అక్టోబర్ 2020
Yadadri - Jan 18, 2020 , 23:51:52

టీఆర్‌ఎస్‌ ప్రచారం.. ముమ్మరం..

టీఆర్‌ఎస్‌ ప్రచారం.. ముమ్మరం..


ఆలేరుటౌన్‌ : ఆలేరు పట్టణంలో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు ముమ్మరంగా  ప్రచారం చేస్తున్నారు. రెండు రోజులుగా ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి పట్టణంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పార్టీ అభ్యర్థులు విపక్షాలకు చెమటలు పట్టేలా ఇంటింటికీ తిరుగుతూ కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నారు. ప్రజాసంక్షేమ పథకాలు పొందిన లబ్ధిదారులు పార్టీ అభ్యర్థులకు మద్దతుగా  స్వచ్ఛందంగా వారి వెంట ఉంటూ వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. 1వ వార్డు అభ్యర్థి పోరెడ్డి జయశ్రీనివాస్‌ వార్డులోని సంతోషిమాత దేవాలయం, గణేశ్‌నగర్‌, మున్సిపల్‌ కార్యాలయం, డా.బాలన్‌ కాలనీ, సంతోశ్‌నగర్‌, విద్యుత్‌ ఈఆర్‌వో కార్యాలయం సమీపంలోని ప్రతి ఇంటింటికీ వెళ్లి వారి ఆశీర్వాదాలు తీసుకుంటూ కారు గుర్తుకు ఓటేయ్యాలని అభ్యర్థిస్తున్నారు. 12వ వార్డు అభ్యర్థి వస్పరి శంకరయ్య ప్రచారం ఆ వార్డు విపక్షాల అభ్యర్థులకు మింగుడుపడటం లేదు. ఏ విధంగానైనా ఆయనను ఓడించాలని కలలుగంటున్న నాయకులకు ఆయనకు ప్రజల ఆదరణతో కంగు తింటున్నారు. రెండుసార్లు ప్రభుత్వ విప్‌ పర్యటనలు చేయడంతో క్యాడర్‌ ఇనుమడించిన ఉత్సాహంతో.. ఇంటింటికీ తిరుగుతూ వస్పరి శంకరయ్య గెలుపునకు కృషి చేస్తున్నారు. ఎండాకాలంలో తమకు నీళ్లు ఇచ్చాడని, బాధలు కల్గినపుడు ఆర్థికంగా ఆదుకున్నాడని, ఇంటింటికీ తిరుగుతూ యోగక్షేమాలు కనుక్కున్న శంకరయ్యకు తప్పక ఓటేసి గెలిపించుకుంటామని అంటున్నారు. ఆయనకు మద్దతుగా యువకులు పెద్ద ఎత్తున ఇంటింటికీ తిరుగుతూ మహిళలను, వ్యవసాయ కార్మికులను, గృహిణులను కలుస్తున్నారు.logo