గురువారం 25 ఫిబ్రవరి 2021
Yadadri - Jan 18, 2020 , 00:16:41

టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు తథ్యం

టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు తథ్యం
  • - ఎమ్మెల్సీ, విప్‌ కర్నె ప్రభాకర్‌భువనగిరి, నమస్తే తెలంగాణ : ఎన్నిక ఏదైనా టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు తథ్యమని ఎమ్మెల్సీ, విప్‌ కర్నె ప్రభాకర్‌ అన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డితో కలిసి శుక్రవారం టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నదని గుర్తు చేశారు. పురపాలిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయ దుంధుభి మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భువనగిరి మున్సిపల్‌ సమగ్రాభివృద్ధి సాధించాలంటే టీఆర్‌ఎస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థుల కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ నిరంతరం ప్రజల సమస్యల పరిష్కారం కోసం పాటుపడే ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి పట్టణ సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తారన్నారు. ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది తలెత్తినా క్షణాల్లో పరిష్కార మార్గం చేపట్టే సేవకుడు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అని కొనియాడారు. బంగారు తెలంగాణ రూపకల్పనలో అన్నివర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని సూచించారు. ముఖ్యమంత్రి చేపడుతున్న ప్రజాసంక్షేమ పథకాలను అన్ని రాష్ర్టాలు ఆచరిస్తున్నాయంటే కేసీఆర్‌ పాలనాదక్షత తేటతెల్లమవుతున్నదన్నారు. ఎన్నికల ముందు కల్లబొల్లి మాటలు చెప్పే పార్టీలకు ప్రజలు ఓట్ల రూపంలో తగిని రీతిలో బుద్ది చెప్పాలని కోరారు.  ఆయా కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ జడల అమరేందర్‌గౌడ్‌, పీఏఈసీఎస్‌ చైర్మన్లు ఎడ్ల సత్తిరెడ్డి, బల్గూరి మధుసూదన్‌రెడ్డి, ఎంపీపీ నరాల నిర్మలవెంకటస్వామి, జెడ్పీటీసీ సభ్యులు సుబ్బూరు బీరుమల్లయ్య, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ అబ్బగాని వెంకట్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు జనగాం పాండు, టీఆర్‌ఎస్‌ నాయకులు ఎడ్ల రాజేందర్‌రెడ్డి, చందుపట్ల రాజేశ్వరావు, కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి, జక్క రాఘవేందర్‌రెడ్డి, నక్కల చిరంజీవియాదవ్‌, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, పోటీ చేస్తున్న అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo