ఆదివారం 07 మార్చి 2021
Yadadri - Jan 18, 2020 , 00:15:19

1 నుంచి చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలు

1 నుంచి చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలు

నార్కట్‌పల్లి : ఫిబ్రవరి 1 నుంచి 6 వరకు నిర్వహించనున్న చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆర్డీఓ జగదీశ్‌రెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వర్లు  అన్నారు. శుక్రవారం మండలంలోని చెర్వుగట్టు ఆలయాన్ని సందర్శించారు. గుట్ట కింద ఉన్న పార్వతీ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాట్లను పరిశీలించారు. బ్రహ్మోత్సవాలకు లక్షల్లో భక్తులు వస్తారని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించాలని ఆలయ సిబ్బందిని కోరారు. దుకాణాలు వెనుకకు జరిపేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ సిబ్బందికి సూ చించారు. ట్రాఫి క్‌ నియంత్రణ కోసం భారీకేడ్లను ఏర్పా టు చేయాలని, స్వామివారి కల్యా ణం రోజు భక్తులు సమర్పించే తలంబ్రాల బియ్యం పోసే విధంగా చర్య లు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో డీపీఓ విష్ణువర్ధన్‌రెడ్డి, డీఈ పాపారావు, ఈఓ సులోచన, అభివృద్ధ్ది కమిటీ చైర్మన్‌ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, తాసిల్దార్‌ రాధ, ఎంపీడీఓ సాంబ శివరావు, ఎంపీఓ సత్యనారాయణ, సర్పంచ్‌ మల్గ బాలక్రిష్ణ, దేవాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.

VIDEOS

logo