శనివారం 27 ఫిబ్రవరి 2021
Yadadri - Jan 17, 2020 , 00:07:23

ప్రచారం ముమ్మరం..

ప్రచారం ముమ్మరం..


యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ : మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకున్నది. బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లు ప్రకటించడంతో వారు ఓటర్లను తమవైపు తిప్పుకునే పనిలో పడ్డారు. ఇంటింటికీ తిరుగుతూ తమకు అండగా నిలువాలని అభ్యర్థిస్తున్నారు. టీఆర్ పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈసారి జిల్లాలోని 6 మున్సిపాలిటీల పీఠాలపై గులాబీ జెండా ఎగురవేసేలా ఆ పార్టీ శ్రేణులు ముందుకు సాగుతున్నారు. 104 వార్డుల్లో క్లీన్ చేసేలా వ్యూహరచన చేస్తున్నారు. భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో శాసనమండలి విప్ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ ఆలేరు మున్సిపాలిటీలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్ చౌటుప్పల్ మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ యాదగిరిగుట్ట పట్టణంలోని పలు వార్డుల్లో టీఆర్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్ గురువారం ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓటర్లు విజ్ఞతతో టీఆర్ పార్టీకి పురపాలికలో పట్టం కట్టాలని కోరుతున్నారు.

ప్రత్యేక వ్యూహంతో ముందుకు..

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా గులాబీ పార్టీ ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతున్నది. నామినేషన్ల పర్వం ముగింపుతోపాటు అభ్యర్థుల తుది జాబితా ప్రకటించడంతో టీఆర్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంటింటికీ తిరుగుతూ ఒక్కసారి చాన్స్ ఇచ్చి చూడాలని కోరుతున్నారు. మున్సిపాలిటీల్లో అధికార పార్టీ అభ్యర్థులు కౌన్సిలర్లుగా ఉంటేనే అభివృద్ధి సాధ్యపడుతుందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ రాబోయే రోజుల్లో వార్డులో చేసే అభివృద్ధిని ఓటర్లకు వివరిస్తున్నారు. పురపాలక సంఘం ఎన్నికల భారం మొత్తం స్థానిక ఎమ్మెల్యేలు, టీఆర్ నాయకులు భుజస్కంధాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వేసిన నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు మున్సిపాలిటీల్లోనే ఉంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎలాగైనా పురపాలికలపై గులాబీ జెండాను ఎగురవేసి ముఖ్యమంత్రి కేసీఆర్ కానుకగా ఇవ్వాలనే పట్టుదలతో ముందుకెళ్తున్నారు. ఒక్కో వార్డుకు సుమారు 4 గంటల సమయం కేటాయించి ఓటర్లకు టీఆర్ చేపట్టిన అభివృద్ధిని వివరిస్తున్నారు.

వార్డులకు ఇన్ నియామకం..

యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు, చౌటుప్పల్, భూదాన్ పోచంపల్లి, భువనగిరి, మోత్కురు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో టీఆర్ వ్యూహ రచనలు చేస్తున్నది. ఇప్పటికే పురపీఠం తమదేనన్న ధీమాతో టీఆర్ ముఖ్యవర్గాలు ఉన్నాయి. అయితే వార్డులన్నింటినీ గెలిచేందుకు ప్రచారం చేసే విషయంలో నేతలు కొత్త ఆలోచనలకు నాంది పలుకుతున్నారు. వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి.. ప్రతి ఓటరును కలిసి ఓటు అడిగేలా నాయకులు వార్డుల వారీగా ఇన్ నియమించి బాధ్యతలు అప్పగించారు. నాలుగైదు వార్డులు కలిపి ఓ ముఖ్య కూడలి వద్ద సభను ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు. ఏయే సమయాల్లో ఎక్కడెక్కడ నిర్వహించాలో నిర్ణయించుకుంటున్నారు. ఖచ్చితంగా గెలుస్తామనే వార్డులో ప్రచారంలో లోటు ఉండకుండా ఇప్పటినుంచే తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అభ్యర్థులు వార్డుల్లో తమ బంధువులు, మిత్రులు, యూత్ సభ్యులు, వివిధ సంఘాల ప్రతినిధులు, వార్డు ముఖ్యులను కలుస్తూ ముందుకెళ్తున్నారు. సామాజిక మాధ్యమాలైన వాట్సాప్, ఫేస్ ట్విట్టర్, ఇన్ వంటి వాటిని వినియోగించుకుంటున్నారు. టీఆర్ చేపట్టిన, చేపట్టబోయే కార్యక్రమాలపై తక్కువ నిడివి ఉన్న వీడియోలను ప్రజలకు చేరవేస్తున్నారు. ఈ వీడియోల్లో ఆయా వార్డుల అభ్యర్థుల వివరాలు పొందుపరుస్తున్నారు. ప్రతి వార్డులో ప్రత్యేక పరిశీలకులను నియమించారు. ప్రచారంలో వెలికివస్తున్న లోపాల గుర్తింపు, మార్పులు, చేర్పులు, అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు పరిశీలకులు పార్టీకి చేరవేస్తారు. ప్రతి వార్డు పార్టీ ఇన్ ఆయా ఎమ్మెల్యేలతో.. ముఖ్యనేతలతో సమాలోచనలు జరిపి ఆ మేరకు తుది నిర్ణయాన్ని తీసుకుంటూ ముందుకెళ్తున్నారు.

భువనగిరిలో విప్ కర్నె ప్రభాకర్, పైళ్ల శేఖర్

జిల్లాలో మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం జోరందుకున్నది. శాసనమండలి విప్ కర్నె ప్రభాకర్, పైళ్ల శేఖర్ తనదైన రీతిలో దూసుకుపోతుండగా, భువనగిరి మున్సిపాలిటీలో ప్రతిపక్షాల ఉనికి కనబడని పరిస్థితి నెలకొన్నది.  జిల్లాలో ఎక్కువ వార్డులు కలిగిన భువనగిరి పురపాలికలో వారు ప్రచారం ముమ్మరం చేశారు. రోడ్డుషోలు నిర్వహించి కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు.

ఆలేరులో గొంగిడి సునీతామహేందర్

ఆలేరు మున్సిపాలిటీలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్ సైతం ప్రచారం ప్రారంభించారు. ఓటర్లను ప్రత్యక్షంగా కలవడం ద్వారా మున్సిపాలిటీలో తమ మెజార్టీ మరింత పెంచుకునే దిశగా పక్కా ప్రణాళికలతో సభలు, సమావేశాలు చేపడుతున్నారు. ఒక్కరోజు కూడా విశ్రాంతి పేరెత్తకుండా ప్రతి రోజు ఏదో ఒక కార్యక్రమంతో కులసంఘాలను కలిసే ప్రయత్నం చేస్తున్నారు.

యాదగిరిగుట్టలో గొంగిడి మహేందర్ రోడ్డుషో..

యాదగిరిగుట్ట మున్సిపాలిటీల్లో టీఆర్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. టీఆర్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్ 1,2,3,4,5,6 వార్డుల్లో రోడ్ గురువారం నిర్వహించారు. యాదాద్రి అభివృద్ధితో యాదగిరిగుట్టలోని ప్రజలకు మరింత ఉపాధి లభించే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ సీఎం కేసీఆర్ అండగా నిలువాలని ప్రచారం చేశారు.

చౌటుప్పల్ మాజీ ఎంపీ బూర ప్రచారం..

చౌటుప్పల్ మున్సిపాలిటీలో మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, పార్టీ నియోజకవర్గ ఇన్ కూసుకుంట్ల ప్రభాకర్ ప్రచారం నిర్వహించారు.  బరిలో దిగిన టీఆర్ కౌన్సిలర్ అభ్యర్థులు, సమరోత్సాహంతో ముందుకెళ్తున్నారు. గడిచిన ఆరేండ్ల్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. ఇప్పటికే చాలాచోట్ల అభ్యర్థులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారు. మా ఓటు మీకే అంటూ ప్రకటిస్తున్నారు. మోత్కూరు మున్సిపాలిటీలో ప్రతి ఇంటికీ తిరుగుతూ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తూ సఫలమవుతున్నారు. సబ్బండ కులాల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గాదరి కిశోర్ తనదైన శైలిలో ప్రచారం ప్రారంభించారు. వార్డుల్లో తిరుగుతూ మోత్కూర్ మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు.


VIDEOS

logo