శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Yadadri - Jan 17, 2020 , 00:06:05

పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించాలి

పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించాలి


భువనగిరి, నమస్తే తెలంగాణ  : మున్సిపల్ ఎన్నికలు కట్టుదిట్టంగా నిర్వహించేందుకు యుద్ధప్రాతినదికపై అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ అనితారామచంద్రన్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశంలో జాయింట్ కలెక్టర్ రమేశ్ కలిసి మున్సిపల్ కమిషనర్లతో గురువారం సమావేశమై ఏర్పాట్లను సమీక్షించారు. డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలు ఒకే ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవాలని, వాటితోపాటు, తాత్కాలిక స్ట్రాంగ్ రూంను ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ విషయంలో నిర్దిష్టంగా ప్రణాళిక రూపొందించుకోవాలని ఎలాంటి పొరపాట్లకు తావివ్వరాదని ఆదేశించారు. రూటు మ్యాపు ప్లాను తయారు చేసుకుని పోలీసు యంత్రాంగానికి అందజేయాలన్నారు. బ్యాలెట్ పేపర్లను సంబంధిత పోలీస్ భద్రపరచాలని కలెక్టర్ తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద సరిపడా కౌంటర్లు ఏర్పాటు చేసుకోవాలని, సిబ్బందికి తొలుత ఉత్తర్వుల ప్రతులు అందజేయాలని కోరారు. స్టాట్యుటరీ, నాన్ స్టాట్యుటరీ కవర్ల పంపిణీకి ప్రత్యేక కౌంటర్లు, ఆర్.ఓల వారీగా తగినంత ఫర్నిచర్ ఏర్పాటు చేసుకోవాలని కోరారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద కౌంటర్లకు విధిగా బోర్డులు ఏర్పాటు చేయాలని ఎన్నికల సిబ్బందికి అల్పాహారం, భోజన ఏర్పాట్లు విధిగా సమకూర్చాలని మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ ఆదేశించారు. పోలింగ్ మెటీరియల్ పనులు మందకొడిగా సాగుతున్నాయని పనిలో వేగం పెంచాలన్నారు. సోషల్ మీడియాపట్ల అప్రమత్తతతో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం ఇవ్వరాదన్నారు.

పోలింగ్ కేంద్రాల వారీగా బ్యాలెట్ పేపర్లు వేరు చేసుకోవడం, స్టాట్యుటరీ, నాన్ స్టాట్యుటరీ కవర్లు, మార్కుడ్ కాపీలు, బ్యాలెట్ బాక్సులు, రూటువారీగా బస్సు సౌకర్యం తదితర పనులన్నీ ప్రాధాన్యతనిచ్చి పూర్తిచేయాలన్నారు. అధికారులు ఎన్నికల పనులు ముగిసేవరకు హైదరాబాదు వెళ్లవద్దని, సంబంధిత మున్సిపాలిటీల్లో అన్ని పనులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎన్నికల విషయంలో నిర్లక్ష్యం, నిర్లిప్తత ప్రదర్శించే వారిపై తగు చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఫొటో ఓటరు స్లిప్పుల పంపిణీ విషయంలో రిటర్నింగ్ అధికారులు నిబంధనలకు లోబడి నిర్ధిష్టమైన షెడ్యూల్డ్ పంపిణీ చేపట్టాలని ఆమె సూచించారు. ఈ విషయంలో ఆథరైజ్డ్ అధికారిని నియమించుకుని నిర్దిష్టమైన తేదీ నుంచి, నిర్దిష్టమైన తేదీలోగా ఓటరు స్లిప్పుల పంపిణీ కార్యక్రమం పూర్తి చేయాలని కోరారు. సమావేశంలో డీఆర్ వెంకట్ జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి ఆర్డీఓలు సూరజ్ భూపాల్ మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల విధులకు గైర్హాజరు కావద్దు : కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల విధులు కేటాయించబడిన సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లో విధులకు గైర్హాజరు కావొద్దని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనితారామచంద్రన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బంది విధులకు గైర్హాజరు అయితే ఎన్నికల నిబంధనల మేరకు తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. రిజర్వులో ఉన్న సిబ్బంది కూడా సకాలంలో హాజరు కావాలని, ఎవరికీ కూడా న్నికల విధుల నుంచి ఎంతమాత్రం మినహాయింపు లేదని కలెక్టర్ అన్నారు.

VIDEOS

logo