ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Yadadri - Jan 15, 2020 , 01:38:05

బరిలో వీరే..

బరిలో వీరే..
  • -ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
  • -పోటీలో ఉన్న అభ్యర్థులు 433 మంది
  • -జిల్లాలో ఆరు మున్సిపాలిటీలు, 104 వార్డులు
  • -నామినేషన్లు వేసిన 750 మంది అభ్యర్థులు
  • -ఇందులో 317 మంది అభ్యర్థుల ఉపసంహరణ
  • -అభ్యర్థులు, గుర్తులు ఖరారు చేసిన ఎన్నికల అధికారులు

యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ: పురపోరులో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడంతో బరిలో నిలిచే అభ్యర్థులను అధికారులు ప్రకటించారు. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో 750 నామినేషన్లు దాఖలు కాగా ఇందులో 317 నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో 433 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఆరు మున్సిపాలిటీల్లోని 104 వార్డుల్లో 433 మంది అభ్యర్థులు బరిలో నిలువగా పలు వార్డుల్లో రెబల్‌ అభ్యర్థులు సైతం బరిలో  ఉన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు ఆయా మున్సిపాలిటీల్లో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. దీంతో ఉదయం నుంచి రెబల్‌ అభ్యర్థులను బుజ్జగించే పనిలో పడిన ఆయా పార్టీల నాయకులు, ఎమ్మెల్యేలు నామినేషన్లను విరమించే పనిలోపడ్డారు. దీంతో కొంత వరకు రెబల్‌ అభ్యర్థులను ఉపసంహరించేలా చేసినా పలు మున్సిపాలిటీల్లో రెబల్‌ బెడద తప్పలేదు.

రెబల్స్‌ బెడద తగ్గుముఖం

జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో  ఎన్నికల ప్రధాన ఘట్టం ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ పూర్తి చేసిన అధికారులు బరిలో నిలిచే అభ్యర్థులను మంగళవారం ప్రకటించారు. బల్దియా ఎన్నికల్లో నామినేషన్‌ వేసిన అభ్యర్థులకు ఉప సంహరణ కో సం మధ్యాహ్నం 3 గంటలకు వరకు గడు వు  ఇచ్చారు. ఆయా పార్టీల నాయకులు చేపట్టిన బుజ్జగింపుతో దాదాపు 70 శాతానికి పైగా అభ్యర్థులు తన నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. అయితే ప్రధానంగా టీఆర్‌ఎస్‌ పార్టీలోనే రెబల్‌ అభ్యర్థులు ఎక్కువగా ఉండటంతో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రెబల్స్‌తో చర్చలు జరిపారు. దీంతో చాలా మంది రెబల్స్‌ బెదడ తగ్గుముఖం పట్టింది.  జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో 750 నామినేషన్లకు 317 మంది ఉప సంహరించుకున్నారు. దీంతో 433 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

బరిలో 433 అభ్యర్థులు

జిల్లాలో ఆరు మున్సిపాలిటీల పరిధిలో 104 వార్డుల్లో మొత్తం 750 నామినేషన్లు దాఖలు కాగా, ఇందులో 317 మంది మంగళవారం ఉపసంహరించుకున్నారు.  దీంతో 433 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఆలేరు మున్సిపాలిటీల్లో 123 మంది అభ్యర్థుల్లో 71 మంది అభ్యర్థులు ఉపసంహరించుకోగా 52 మంది బరిలో నిలిచారు. భువనగిరిలో 267 మంది నామినేషన్లు దాఖలు కాగా 106 మంది ఉపసంహరించుకోగా 161 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. చౌటుప్పల్‌ మున్సిపాలిటీ పరిధిలో 126 మంది నామినేషన్లు వేయగా 51 మంది ఉపసంహరించుకోగా 75 మం ది బరిలో నిలిచారు. భూదాన్‌పోచంపల్లిలో 94 మంది నామినేషన్లు దాఖలు చేయగా 42 మంది ఉపసంహరించుకోగా 52 మం ది బరిలో నిలిచారు. మోత్కూరులో 63 నా మినేషన్లు దాఖలు చేయగా ఇందులో 18 మంది ఉపసంహరించుకోగా 45 మంది బరిలో ఉన్నారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 77 నామినేషన్లు దాఖలు కాగా ఇం దులో 29 మంది నామినేషన్లు ఉప సంహరించుకోగా 48 మంది బరిలో నిలిచారు.

ఇండిపెండెంట్‌ అభ్యర్థుల గుర్తులు ఖరారు

జిల్లాలో ఇండిపెండెంట్‌ అభ్యర్థులకు మంగళవారం ఎన్నికల అధికారులు గుర్తింపులను ఖరారు చేశారు. ఆయా మున్సిపాలిటీ కౌన్సిలర్‌ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న టీఆర్‌ఎస్‌ రెబల్‌, ఇండిపెండెంట్‌ అభ్యర్థులకు గ్యాస్‌ పొయ్యి, గ్యాస్‌ స్టవ్‌, గ్యాస్‌ సిలిండర్‌, వంగరం, కత్తెర, కప్పసాసర, యాపిల్‌ మొదలగు గుర్తులను కేటాయించారు.

బుజ్జగింపుదారులకు భారీగా నజరానాలు

అభ్యర్థులుగా ఖరారు అయిన వారు బుజ్జగింపుదారులకు భారీగా నజరానాలు అందజేశారు. గొంతెమ్మ కోర్కెలతో అన్ని పార్టీల్లో పోటాపోటీగా బరిలో మేముంటామంటే మేముంటామని చేసిన హంగామాకు చాలా వరకు తెరపడింది. కానీ ముట్టజెప్పే పర్వం నడవడంతో ఈ మూడు రోజులు రాజకీయాలు గరం.. గరంగా మారి అభ్యర్థులుగా మిగిలినవారిని ముచ్చెమటలు పట్టించాయి.

VIDEOS

logo