సోమవారం 25 మే 2020
Yadadri - Jan 15, 2020 , 01:35:12

‘గుట్ట’ రూపురేఖలు మారుస్తాం

‘గుట్ట’ రూపురేఖలు మారుస్తాం
  • -ప్రతి వార్డులో మౌలిక వసతులు కల్పిస్తాం
  • -అన్నింటా గులాబీ జెండా ఎగురవేయాలి

యాదగిరిగుట్ట, నమస్తేతెలంగాణ: యాదగిరిగుట్ట పట్టణ రూపురేఖలు మారుస్తామని, ప్రతి వార్డులో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, ఎల్‌ఈడీ సెంట్రల్‌ లైటింగ్‌, ప్రతి ఇంటికీ ఉచితంగా మిషన్‌ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు నల్లా కనెక్షన్లు అందజేస్తామని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. యాదగిరిగుట్ట పట్టణంలోని 5వ వార్డులో మంగళవారం టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రభుత్వ విప్‌ ప్రారంభించగా, 2వ వార్డులో బుడగ జంగాల కాలనీ ప్రజలతో గొంగిడి మహేందర్‌రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధంటే ప్రతి వ్యక్తి ఆదాయం పెరగడమేనని తెలిపారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌తోనే పట్టణ అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ఓటేస్తే చెత్తకుప్పలో వేసినట్టేనన్నారు. అభివృద్ధి కావాలో..? లేదో..? తేల్చుకోవాల్సిన సమ యం ఇప్పుడేనని తెలిపారు. యాదగిరిగుట్ట మున్సిపల్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని చైర్మన్‌గా గెలిపించుకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ వద్దకు వెళ్లి మరిన్ని నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఓటర్లు ఆలోచించి కారు గుర్తుకు ఓటేసి అభివృద్ధికి బాటలు వేయాలని సూచించారు. 2వ వార్డులో బూడగ జంగాల కాలనీలో ఎమ్మెల్యే ప్రత్యేక నిధులతో ఫంక్షన్‌ హాల్‌ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో 2వ వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థి కోల వెంకటేశ్‌, 5వ వార్డులో ఆరె విజయలక్ష్మీ, చిత్తర్ల బాలయ్య, నర్సింహ పాల్గొన్నారు.

ఆలేరు మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ జెండా ఎగురాలి
ఆలేరుటౌన్‌: త్వరలో జరుగనున్న ఆలేరు మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ జెండా ఎగురాలని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆలేరు పట్టణంలోని దొంతిరి గార్డెన్స్‌లో మంగళవారం రాత్రి టీఆర్‌ఎస్‌ తరపున మున్సిపల్‌ ఎన్నికల అభ్యర్థులుగా ఎన్నికయిన వారితో ఆమె ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆలేరు మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేయనున్నదన్నారు. ఎన్నికల్లో పార్టీ వంద శాతం గెలుపు ఖాయమని, సర్వే రిపోర్టులు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వచ్చాయన్నారు. ఎన్నికలు అయ్యేంతవరకు ప్రతి ఒక్కరూ విశ్రమించకుండా పార్టీ విజయానికి గట్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ విజయానికి కృషి చేసిన వారికి భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పిస్తామని, పార్టీ ఆదేశాలు ధిక్కరించిన వారిపై వేటు తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.logo