మంగళవారం 14 జూలై 2020
Yadadri - Jan 15, 2020 , 01:33:37

పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం

పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం


 సంస్థాన్‌నారాయణపురం: కమ్యూనిష్టు పార్టీల పోరాటాల ఫలితంగానే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతున్నాయని సీపీఎం కేంద్రకమిటీ సభ్యుడు చెరుపల్లి శీతారాములు అన్నారు. మం డల పరిధిలోని శేరిగూడెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచు కీసర రాంచంద్రారెడ్డి 3వ వర్ధంతి వేడుకల్లో మంగళవారం ఆయన పాల్గొని అతని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ రాంచంద్రారెడ్డి తాను నమ్మిన సిద్దాంతం కోసం తన తుది శ్వాసవరకు కృషి చేశారని గుర్తుచేశారు. ఆయన ఆదర్శాలను అందరు కొనసాగించాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ. జహంగీర్‌, ఎంపీటీసీ దోడ వినోద్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు సుర్కంటి శ్రీనివాస్‌రెడ్డి, జి. శ్రీనివాసచారి, సుదర్శనచారి, కుటంబ సభ్యులు పర్వతరెడ్డి, భూపతిరెడ్డి, పురుషోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


logo