ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Yadadri - Jan 14, 2020 , 00:12:34

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి
  • భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి పట్టణంలోని 17వ వార్డులో విస్తృతంగా ప్రచారం

భువనగిరి,నమస్తేతెలంగాణ: మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. సోమవారం భువనగిరి పట్టణంలోని 17వ వార్డు పగిడిపల్లిలో శ్రీశివ సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భువనగిరి మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే టీఆర్‌ఎస్‌ అభ్యర్ధులకు పట్టం కట్టాలన్నారు. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు సైతం రానివ్వద్దన్నారు. సీఎం కేసీఆర్‌ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందుతున్నాయని, రాష్ట్రంలో సుస్థిర పాలన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ డాక్టర్‌ జడల అమరేందర్‌గౌడ్‌, మార్కెట్‌ కమిటీ డైరక్టర్‌ కట్కూరి జంగయ్యగౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు జనగాం పాండు, అనంతారం సర్పంచ్‌ చిందం మల్లికార్జున్‌, రాంపల్లి ఆంజనేయులు, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

VIDEOS

logo