శనివారం 06 మార్చి 2021
Yadadri - Jan 14, 2020 , 00:10:22

అండగా ఉంటాం

అండగా ఉంటాం

రోడ్డు విస్తరణలో ఇండ్లు, దుకాణాలు కోల్పోతున్న వారికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ న్యాయం చేస్తారు
 ప్రభుత్వ విప్‌ గొంగిడి  సునీతామహేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేందర్‌రెడ్డి
యాదగిరిగుట్ట, నమస్తేతెలంగాణ: యాదాద్రి పునర్నిర్మాణంలో భాగంగా రోడ్డు విస్తరణలో ఇండ్లు, దుకాణాలు కోల్పోతున్న వారికి పూర్తిస్థాయిలో అండగా ఉంటామని,  ఇండ్లు కోల్పోతున్న నిర్వాసితులకు ఇండ్లు, దుకాణం కోల్పోతున్న వారికి దుకాణాలు నిర్మిస్తామని, ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చారని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం యాదగిరిగుట్ట పట్టణంలోని 1వ వార్డులో రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోతున్న 72 కుటుంబాలతో వారు మాట్లాడారు. సుమారు రెండు గంటల పాటు వారితో చర్చించారు. ముఖ్యంగా డ్రైనేజీ సమస్యలతో పాటు మున్సిపల్‌ అధికారులు స్పందించడంలేదని చెప్పడంతో ఆమె వెంటనే స్థానిక అధికారులతో మాట్లాడారు. రోడ్డుపైనే దుకాణాలు పెట్టుకుని జీవనం గడుపుతున్నామని, దుకాణంతోపాటు ఇండ్లుకోల్పోతే రోడ్డున పడాల్సి వస్తుందని స్థానికులు ప్రభుత్వ విప్‌నకు వివరించారు. దీంతో స్పందించిన ఆమె దుకాణాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రోడ్డు విస్తరణలో భూములు, ఇండ్లు, దుకాణాలు కోల్పోయిన వారికి సరైన న్యాయం చేసేలా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచిస్తున్నారని తెలిపారు. గతంలోనే ఇక్కడి భూ నిర్వాసితులతో ప్రగతిభవన్‌లో ఆరు గంటల పాటు చర్చించారని తెలిపారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ ఆలయ అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్‌, ఇక్కడి నిరుపేదల పొట్టగొట్టే పనిచేయరన్నారు.   ప్రతి ఒక్కరూ కారుగుర్తుకు ఓటేసి 12 కౌన్సిలర్లకు 12 మందిని గెలిపించుకుని యాదగిరిగుట్ట మున్సిపాలిటీని సీఎం కేసీఆర్‌కు కానుక ఇద్దామన్నారు. ఈ కార్యక్రమంలో 1వ వార్డు అభ్యర్థి గోర్ల పద్మ భాస్కర్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, తంగళపల్లి సుగుణాకర్‌, కాంటెకర్‌ పవన్‌, వార్డు ఇన్‌చార్జి  ఆరె మల్లేశ్‌గౌడ్‌, సయ్యద్‌ బాబా, షేక్‌ దావూద్‌, లఖాన్‌,  బీరయ్య  పాల్గొన్నారు. 
టీఆర్‌ఎస్‌లోకి చేరికలు..
మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా టీఆర్‌ఎస్‌లో చేరికల పర్వం కొనసాగుతున్నది. యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన అబ్దుల్‌ రవూఫ్‌ తన 20 మంది అనుచరులతో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి వారికి గులాబీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

VIDEOS

logo